తొలిసారి ఫైనల్లో... చెప్పలేని ఆనందం: శ్రేయస్‌ అయ్యర్‌

IPL 2020: Delhi Capitals Enter Maiden Final Shreyas Says Feeling Happy - Sakshi

అబుదాబి: ఆదివారం జరిగిన ఐపీఎల్‌-2020 క్వాలిఫైయర్‌- 2 మ్యాచ్‌లొ సన్‌రైజర్స్‌పై గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పట్టలేని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అబుదాబిలోని షేక్ జాయేద్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ  ఇచ్చిన 190 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ ఛేదించలేకపోయింది. చివర్లో వికెట్లు కోల్పోవడంతో 20 ఓవర్లలో 172 పరుగులకే పరిమితం అయింది. బౌలర్ల అద్భుతప్రదర్శనతో ఢిల్లీ 17 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంపై అయ్యర్‌ జట్టు ఆటగాళ్లకు, యాజామన్యానికి ధన్యావాదాలు తెలిపాడు.

 ఈ సందర్భంగా అయ్యర్‌ మాట్లాడుతూ.. తమ విజయానికి కొన్ని కీలక నిర్ణయాలు కారణమని చెప్పాడు. ‘ఈ విజయానుభూతి అద్భుతంగా ఉంది. రోలర్‌ కాస్టర్‌లా హెచ్చుతగ్గులు వచ్చినప్పటికీ మా జట్టంతా ఒకకుటుంబంలా ఉన్నాం. కెప్టెన్‌గా చాలా బాధ్యతలు ఉన్నా,  టాపార్డార్‌  బ్యాట్స్‌మెన్‌ గాను నిలకడను కొనసాగించాలి. కోచ్‌ల నుంచి, యాజమాన్యం నుంచి నాకు గొప్ప మద్ధతు లభించింది. ఇలాంటి జట్టుతో ఉండటం నిజంగానా అదృష్టం. అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి’ అని అన్నాడు.
 ఈ మ్యాచ్‌లో శిఖర్‌ ధావన్‌తో కలసి ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ స్టోయినిస్‌ బరిలోకి దిగాడు. 27 బంతుల్లో 38 చేసి శుభారంభాన్ని ఇవ్వడమే కాకుండా మూడు కీలక వికెట్లు తీశాడు. మరో ఓపెనర్‌ ధావన్‌ 50 బంతుల్లో 78 పరుగులుచేశాడు.

ఇక  ఓపెనర్‌ మార్పుపై అయ్యర్‌ మాట్లాడుతూ ‘ఎపుడు ఒకే బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కొనసాగించడం కన్నా అపుడప్పుడు మార్పులు చేయాలి. తర్వాతి మ్యాచ్‌లో కూడా ఇలాంటివి ఉండవచ్చు. దీనివల్ల మేము స్వేచ్ఛగా ఉండటంతోపాటు సహజత్వాన్ని కోల్పోలేం. మా జట్టు పరుగుల పట్ల సంతోషంగా ఉన్నాం. ఓవర్‌కు దాదాపు 10 పరుగుల చొప్పున సాధించాం. రషీద్‌ బౌలింగ్‌ తో ప్రమాదమే అయినా, భారీ షాట్లు ఆడాలని నిర్ణయించుకున్నాం. మాఓపెనింగ్‌ జోడి నుంచి గొప్ప ఆరంభం లభించింది. స్టోయినిస్‌ ఎన్ని ఎక్కువ బంతులు ఆడితే, మాకు అంత మంచి ప్రారంభం ఇవ్వగలడు.’ అని తెలిపాడు. నవంబర్‌ 10న దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌-2020 ఫైనల్‌ లో ఢిఫెండింగ్‌  ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో పోరుకు ఢిల్లీ కాపిటల్స్‌ సిద్ధంగా ఉంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top