Ben Stokes 56 Number Armband: 56వ నెంబర్‌తో బరిలోకి.. నాన్నకు ప్రేమతో

Intresting Facts Ben Stokes Wore 56 Number Black Armband Ashes Test - Sakshi

Ben Stokes Wore 56 Number ArmBand Tribute For His Father.. ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ దాదాపు 4 నెలల తర్వాత యాషెస్‌ సిరీస్‌ ద్వారా పునరాగమనం చేశాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో స్టోక్స్‌ చేతికి 56వ నెంబర్‌ ఉన్న రిబ్బన్‌ వేసుకొని బరిలోకి దిగడం ఆసక్తికలిగించింది. అయితే స్టోక్స్‌ ఆ రిబ్బన్‌ ధరించడం వెనుక పెద్ద కథే ఉంది. 

చదవండి: Ashes Series: స్టోక్స్‌ సూపర్‌ ఎంట్రీ అనుకున్నాం.. ఊహించని ట్విస్ట్‌

Ben Stokes With 56 Number Armband

స్టోక్స్‌కు తన తండ్రి గెరార్డ్ జేమ్స్ స్టోక్స్ అంటే అమితమైన ప్రేమ. గతేడాది డిసెంబర్‌లో గెరార్డ్‌ బ్రెయిన్‌ క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. తండ్రి మరణంతో మానసికంగా కుంగిపోయిన స్టోక్స్‌ ఒత్తిడికి లోనయ్యాడు. ఆటపై సరిగా ఫోకస్‌ పెట్టలేకపోయాడు. ఇక స్టోక్స్‌ ఆటకు నాలుగు నెలలు దూరంగా ఉండడం వెనుక ఇదీ ఒక కారణమే. ఇదిలా ఉంటే డిసెంబర్‌ 8న(బుధవారం) స్టోక్స్‌ తండ్రి గెరార్డ్‌ 56వ పుట్టినరోజు. తండ్రి పుట్టినరోజు సందర్భంగా.. స్టోక్స్‌ ఆయన గుర్తుగా యాషెస్‌ తొలి టెస్టు మ్యాచ్‌లో 56వ నెంబర్‌ ఉన్న రిబ్బన్‌ను ధరించాడు. ఇక 1982లో న్యూజిలాండ్‌ రగ్బీ టీమ్‌లో అడుగుపెట్టిన గెరార్డ్‌ స్టోక్స్‌ క్యాప్‌  నెంబర్‌ కూడా 56 కావడం విశేషం. ఈ రెండు సందర్భాలను కలుపుతూ స్టోక్స్‌ తన తండ్రికి ఘన నివాళి అందించాడు. 

చదవండి: Ben Stokes No Balls: స్టోక్స్‌ నోబాల్స్‌ కథేంటి! అంపైర్లకు కళ్లు కనబడవా?

Ben Stokes With His Father

ఇక నాలుగు నెలల విరామం తర్వాత క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చిన బెన్‌ స్టోక్స్‌ ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో బ్యాటింగ్‌లో నిరాశపరిచాడు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేసిన స్టోక్స్‌.. బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోయాడు. ఏకంగా 14 నోబాల్స్‌ను విసిరిన స్టోక్స్‌ 9 ఓవర్లు వేసి 50 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ తీయలేకపోయాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండోరోజు ఆట ముగిసే సమయానికి  84 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 343పరుగులు చేసింది. ట్రేవిస్‌ హెడ్‌ (112* పరుగులు) సూపర్‌ సెంచరీ సాధించి ఆడుతుండగా.. మిచెల్‌ స్టార్క్‌ 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంతకముందు వార్నర్‌ 94 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 196 పరుగుల ఆధిక్యంలో ఉంది.

చదవండి: David Warner: ఈసారి కచ్చితంగా ఔటయ్యేవాడు! బతుకుజీవుడా అనుకున్న వార్నర్‌

Ben Stokes With His Mother And Father

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top