Ben Stokes No Balls: స్టోక్స్‌ నోబాల్స్‌ కథేంటి! అంపైర్లకు కళ్లు కనబడవా?

Ben Stokes Four Consecutive No-Balls Umpire Fails Check Overstepping - Sakshi

Ben Stokes No Balls Controversy Ashes Series.. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ పునరాగమనం అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ ద్వారా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన స్టోక్స్‌ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. 5 పరుగులు మాత్రమే చేసి కమిన్స్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక బౌలింగ్‌కు విషయానికి వస్తే.. స్టోక్స్‌ బౌలింగ్‌ లయ తప్పింది. అందుకు నిదర్శనమే నోబాల్స్‌. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ను స్టోక్స్‌ వేశాడు. వార్నర్‌ ఆడిన ఆ ఓవర్‌లో తొలి నాలుగు బంతులను స్టోక్స్‌ విసరకముందు.. అతని కాలు క్రీజు నుంచి ఓవర్‌స్టెప్‌ అవ్వడం క్లియర్‌గా కనిపించింది. అటు ఫీల్డ్‌ అంపైర్‌ కానీ.. ఇటు థర్డ్‌ అంపైర్‌ కానీ నో బాల్స్‌ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.

చదవండి: Ashes Series: స్టోక్స్‌ సూపర్‌ ఎంట్రీ అనుకున్నాం.. ఊహించని ట్విస్ట్‌

ఇదే విషయమై సోషల్‌ మీడియాలో క్రికెట్‌ అభిమానులు ట్రోల్‌ చేశారు. ''ఫీల్డ్‌ అంపైర్‌ గమనించలేదు అంటే ఒప్పుకోవచ్చు.. మరీ థర్డ్‌ అంపైర్‌ ఏం చేస్తున్నట్లు.. వారిద్దరికి కళ్లు కనబడలేదా..'' అంటూ కామెంట్స్‌ చేశారు. స్టోక్స్‌ వేసిన నాలుగు నోబాల్స్‌కు సంబంధించిన వీడియోనూ ఆస్ట్రేలియన్‌ మీడియా ట్విటర్‌లో షేర్‌ చేసింది. మరో విశేషమేమిటంటే ఓవర్‌ నాలుగో బంతికి వార్నర్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.. స్టోక్స్‌ ఎంట్రీ అదుర్స్‌ అనుకున్నారు. కానీ అప్పుడు అంపైర్‌ చెక్‌ చేసి నో బాల్‌ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. మరి ముందు మూడు నోబాల్స్‌ కథేంటి అని అభిమానులు ప్రశ్నించారు. ఏది ఏమైనా పాపం స్టోక్స్‌కు రీఎంట్రీ మాత్రం  చేదు అనుభవాన్ని మిగిల్చింది.

స్టోక్స్‌ నోబాల్స్‌ విషయానికి వస్తే... ఐసీసీ రూల్స్‌ ప్రకారం.. థర్డ్‌ అంపైర్‌ ఒక బౌలర్‌ వేసే నోబాల్స్‌ అన్నింటిని ట్రాక్‌ చేయరు. వికెట్‌ బంతులైతేనే రిప్లేలో పరీక్షిస్తారు. క్లాజ్‌ 21.5.2 ప్రకారం.. బౌలర్‌ బంతి విడవడానికి ముందు తన పాదంలో కొద్ది బాగాన్ని క్రీజుపై ఉంచినా.. గ్రౌండ్‌పై పెట్టినా.. మిడిల్‌స్టంప్‌ను కలిపే లైన్‌ లోపల వేసినా అది సరైన బాల్‌ కిందే లెక్కిస్తారు. ఈ మూడు రూల్స్‌ అతిక్రమించినప్పుడే ఫీల్డ్‌ అంపైర్‌ నోబాల్స్‌గా పరిగణిస్తారు. మరోవైపు థర్డ్‌ అంపైర్‌ కూడా టెలివిజన్‌ రిప్లేలో బౌలర్‌ ఫ్రంట్‌ఫుట్‌ ఎండ్‌ను కచ్చితంగా చెక్‌ చేస్తాడు. ఫీల్డ్‌ అంపైర్‌ చూడనప్పుడు...పైన చెప్పిన మూడురూల్స్‌లో ఏ ఒక్కటి బౌలర్‌ అతిక్రమించినా వెంటనే  థర్డ్‌ అంపైర్‌ .. ఫీల్డ్‌ అంపైర్‌కు నోబాల్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరుగుతుంది. మరి స్టోక్స్‌ వేసిన బంతులు నో బాల్స్‌ అని క్లియర్‌గా కనిపిస్తున్నప్పటికి అంపైర్లు ఏ చర్య తీసుకోకపోవడం ఆసక్తి కలిగించింది ఇక మ్యాచ్‌లో ఆట రెండో రోజు లంచ్‌ విరామం ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా 35 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 123 పరుగులు చేసింది. వార్నర్‌ 56, లబుషేన్‌ 55 పరుగులతో ఆడుతున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top