 
													
అరె సూపర్ ఎంట్రీ కదా అని మనం అనుకునేలోపే ఊహించని ట్విస్ట్ ఎదురైంది
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ మైదానంలో బరిలోకి దిగాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ద్వారా అడుగుపెట్టిన స్టోక్స్ బ్యాటింగ్‌లో 5 పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే స్టోక్స్ ఆల్‌రౌండర్ కావడంతో బంతితోనూ మెరిసే అవకాశం ఉంటుంది. అనుకున్నట్లుగానే స్టోక్స్ తాను వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికే ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు.
చదవండి: Ashes Series: డెబ్యూ కెప్టెన్‌గా కమిన్స్ అదుర్స్.. 127 ఏళ్ల తర్వాత

అరె సూపర్ ఎంట్రీ కదా అని మనం అనుకునేలోపే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఎందుకంటే అది నోబాల్. అలా వార్నర్ బతికిపోయాడు. కానీ స్టోక్స్ పునరాగమనం వ్యర్థంగా మిగిలిపోయింది. ఇక్కడ మరో విశేషమేమిటంటే స్టోక్స్ వేసిన ముందు మూడు బంతులు కూడా నోబాల్స్ అయినప్పటికి ఫీల్డ్ అంపైర్‌తో పాటు మూడో అంపైర్ కనీసం పరిగణలోకి తీసుకోలేదు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకు ఆలౌట్ చేసిన ఆసీస్ బ్యాటింగ్‌లో నిలకడ ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం 31 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 113 పరుగులు చేసింది. వార్నర్ 49, లబుషేన్ 53 పరుగులతో ఆడుతున్నారు.
చదవండి: Mitchell Starc: 85 ఏళ్ల రికార్డును తిరగరాసిన మిచెల్ స్టార్క్
— Bleh (@rishabh2209420) December 9, 2021
ICYMI: A costly error from the England allrounder #Ashes https://t.co/E4fCeEwfDB
— cricket.com.au (@cricketcomau) December 9, 2021

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
