అర్జెంటీనా పర్యటన మేలు చేసింది 

Indian Men Hockey Coach Says Argentina Tour Was Important - Sakshi

 భారత పురుషుల హాకీ జట్టు కోచ్‌ గ్రాహమ్‌ రీడ్‌ వ్యాఖ్య  

బెంగళూరు: ఇటీవల ముగిసిన అర్జెంటీనా పర్యటనతో భారత పురుషుల హాకీ జట్టు చాలా లాభ పడిందని జట్టు కోచ్‌ గ్రాహమ్‌ రీడ్‌ అభిప్రాయపడ్డారు. ఒలింపిక్స్‌కు మరో మూడు నెలల సమయమే ఉండటంతో భారత ఆటగాళ్లకు మునుపటి ఫామ్‌ను అందుకునేందుకు ఈ పర్యటన దోహదం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. కరోనావల్ల దాదాపు ఏడాది ఆటకు దూరమైనా... అర్జెంటీనా పర్యటనలో భారత జట్టు అంచనాలకు మించి రాణించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

కాగా, అర్జెంటీనా పర్యటనలో ఆడిన రెండు ప్రొ లీగ్‌ మ్యాచ్‌లను గెల్చుకున్న భారత్‌... నాలుగు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి, ఒక దాంట్లో ఓడి... మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుతం భారత జట్టు బెంగళూరులోని ‘సాయ్‌’ కేంద్రంలో ఒలింపిక్స్‌ సన్నాహాల్లో ఉంది.   

చదవండి: రూ.5,850 కోట్లతో మేం రెడీ..! 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top