IND Vs WI 2nd ODI: వెస్టిండీస్‌తో రెండో వన్డే.. ప్రపంచ రికార్డుకు చేరువలో భారత్‌..!

India Have Chance To Break Pakistan s Record In ODI Series Against West Indies - Sakshi

వెస్టిండీస్‌తో తొలి వన్డేలో విజయం సాధించిన భారత్‌కు మరో పోరుకు సిద్దమైంది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా ఆదివారం జరగనున్న రెండో వన్డేలో భారత్, విండీస్‌ తలపడనున్నాయి. కాగా ఈ మ్యాచ్‌కు ముందు ఓ అరుదైన రికార్డు భారత్‌ను ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధిస్తే.. 2-0తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.

తద్వారా ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా భారత్‌ నిలుస్తోంది. కాగా ఇప్పటి వరకు విండీస్‌పై వరుసగా 11 వన్డే సిరీస్‌ల్లో భారత్‌ విజయం సాధించింది. మరో వైపు పాకిస్తాన్‌ కూడా జింబాబ్వేపై వరుసగా 11 వన్డే సిరీస్‌ల్లో విజయం సాధించి భారత్‌తో సమంగా ఉంది. ఈ సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంటే 12 విజయాలతో పాక్‌ను అధిగమిస్తోంది.
భారత తుది జట్టు (అంచనా)..
శిఖర్ ధవన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్
విండీస్‌ తుది జట్టు(అంచనా)
నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, జేడెన్ సీల్స్,రొమారియో షెపర్డ్
చదవండి: Team India Predicted XI: రెండో వన్డేకు టీమిండియా ఇదే..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top