
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్‌తో ఇవాళ (అక్టోబర్ 10) మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతను అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో) 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
71 ఇన్నింగ్స్‌ల్లో ఈ అరుదైన మైలురాయిని తాకిన జైస్వాల్ భారత్ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) (68 ఇన్నింగ్స్‌లు) జైస్వాల్ కంటే వేగంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 3000 పరుగుల మైలురాయిని తాకాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 51 ఓవర్లలో తర్వాత వికెట్ నష్టానికి 198 పరుగులు చేసింది. జైస్వాల్ 145 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి జతగా సాయి సుదర్శన్ (58) క్రీజ్‌లో ఉన్నాడు.
అంతకుముందు కేఎల్ రాహుల్ 54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 40, సాయి సుదర్శన్ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రాహుల్ వికెట్ వార్రికన్‌కు దక్కింది. అతడి బౌలింగ్‌లో రాహుల్ స్టంపౌటయ్యాడు.
కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు రాహుల్, జురెల్, జడేజా సెంచరీలు చేశారు. సిరాజ్, జడేజా బంతితో రాణించారు.
చదవండి: విండీస్‌తో రెండో టెస్ట్.. చరిత్ర సృష్టించిన బుమ్రా