సత్తాచాటిన బ్యాటర్లు.. భారీ స్కోర్‌ దిశగా భారత్‌ | IND-A vs SL-A: Sai Sudharsan century, Padikkal 94 put India A in command | Sakshi
Sakshi News home page

IND vs SL: సత్తాచాటిన బ్యాటర్లు.. భారీ స్కోర్‌ దిశగా భారత్‌

Jul 4 2026 6:19 PM | Updated on Jul 4 2026 6:25 PM

IND-A vs SL-A: Sai Sudharsan century, Padikkal 94 put India A in command

గాలే వేదిక‌గా శ్రీలంక‌-ఎతో జ‌రుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో భార‌త-ఎ బ్యాట‌ర్లు అదర‌గొట్టారు. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ 8 వికెట్ల న‌ష్టానికి 541 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. 247/1 ఓవర్‌ నైట్‌స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. 

వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ 94 పరుగుల వద్ద అవుటై సెంచరీ చేజార్చుకున్నాడు. ఓపెనర్ సాయిసుదర్శన్ మాత్రం మూడో రోజు కూడా తన దూకుడును కొనసాగించాడు. 22 ఫోర్ల సాయంతో 168 పరుగులు సాధించి ఔటయ్యాడు. 

ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ ధ్రువ్ జురెల్(53), షేక్ రషీద్ కూడా(45) రాణించారు. ప్రస్తుతం క్రీజులో సారాన్ష్‌ జైన్‌(30), యష్‌ ఠాకూర్‌(2) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక కంటే భారత్‌ 175 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. శ్రీలంక బౌలర్లలో కేశర నువాంత నాలుగు, సుదీరా తిలకరత్నే మూడు వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌట్‌ అయింది. కెప్టెన్‌ సహాన్‌ అరాచిగే శతక్కొట్టగా (127).. నువానిదు ఫెర్నాండో 44, అంజల బండారా 42 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో గుర్నూర్‌ బ్రార్‌, సారాన్ష్‌ జైన్‌ నాలుగేసి వికెట్లతో సత్తా చాటగా.. యశ్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు పడగొట్టాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement