Ind Vs Nz 1st Test Day 5: ప్చ్‌.. మనకు నిరాశే.. డ్రాగా ముగిసిన కాన్పూర్‌ టెస్టు

Ind Vs Nz 2021 Test Series Kanpur 1st Test Day 5 Highlights Updates Telugu - Sakshi

Ind Vs Nz 2021 1st Test Day 5 Highlights Updates Telugu: 
04:22 PM:
►గెలుపు ఖాయమనుకున్న తొలి టెస్టులో భారత్‌కు నిరాశ తప్పలేదు. చివరి వికెట్‌ తీయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. రచిన్‌ రవీంద్ర, అజాజ్‌ పటేల్‌ అడ్డుగోడగా నిలబడి విలియమ్సన్‌ బృందాన్ని ఓటమి బారి నుంచి తప్పించారు. ఫలితంగా మ్యాఛ్‌ డ్రాగా ముగిసింది. అరంగేట్ర హీరో శ్రేయస్‌ అయ్యర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక మ్యాచ్‌లో అయ్యర్‌ మొత్తంగా 170 పరుగులు చేశాడు.
టీమిండియా :
తొలి ఇన్నింగ్స్‌: 345-10 (111.1 ఓవర్లలో)
రెండో ఇన్నింగ్స్‌: 234-7 డిక్లేర్డ్‌ (81 ఓవర్లు)

న్యూజిలాండ్‌
తొలి ఇన్నింగ్స్‌: 296-10 (142.3 ఓవర్లలో)
రెండో ఇన్నింగ్స్‌: 165-9(98 ఓవర్లు).

3:55 PM
►విజయం దిశగా పయనిస్తున్న భారత్‌
►ఐదో రోజు ఆటలో భాగంగా న్యూజిలాండ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో టిమ్‌ సౌథీ పెవిలియన్‌ చేరాడు. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అజాజ్‌ పటేల్‌, రచిన్‌ రవీంద్ర క్రీజులో ఉన్నారు. ఇక విజయానికి ఒక వికెట్‌ దూరంలో ఉన్న నేపథ్యంలో రహానే ఫీల్డింగ్‌ను మరింత కట్టుదిట్టం చేశాడు.

3: 44 PM:
►రెండు వికెట్లు పడగొడితే చాలు విజయం టీమిండియాదే.
►‘సర్‌’ రవీంద్ర జడేజా.. జేమీసన్‌ వికెట్‌ పడగొట్టడంతో భారత్‌ గెలుపు ముంగిట నిలిచింది. కివీస్‌ ప్రస్తుత స్కోరు- 147/8 (86.2)

 3:35 PM:
►విజయానికి మూడు వికెట్ల దూరంలో టీమిండియా 
►కివీస్‌ స్కోరు: 143/7 
►న్యూజిలాండ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. టామ్‌ బ్లండెల్‌ను అశ్విన్‌ పెవిలియన్‌కు పంపి భారత్‌ను విజయానికి మరింత చేరువ చేశాడు. ప్రస్తుతం కివీస్‌ టీమిండియా కంటే 138 పరుగులు వెనుకబడి ఉంది.

3:14PM:
►టీమిండియా కంటే న్యూజిలాండ్‌ 146 పరుగులు వెనుకబడి ఉంది‌. ప్రస్తుత స్కోరు: 138/6 (77).
►రచిన్‌ రవీంద్ర(6), టామ్‌ బ్లండెల్‌(2) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2:55PM: టీమిండియా విజయానికి మరింత చేరువైంది. విలియమ్సన్‌ రూపంలో న్యూజిలాండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను రవీంద్ర జడేజా ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. దీంతో న్యూజిలాండ్‌ ఆశలు ఆవిరయ్యాయి. కాగా టీమిండియా విజయానికి ఇంకా 4 వికెట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో టామ్‌ బ్లండెల్‌(2)  ఉండగా, రచిన్‌ రవీంద్ర  క్రీజులోకి వచ్చాడు

న్యూజిలాండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. హెన్రీ నికోల్స్‌ను అక్షర్‌ పటేల్‌ ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. కాగా టీమిండియా విజయానికి ఇంకా 5 వికెట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్‌ 24 పరుగులతో ఉండగా, టామ్‌ బ్లండల్‌ క్రీజులోకి వచ్చాడు

2:14 PM: న్యూజిలాండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 2 పరుగులు చేసిన రాస్‌ టేలర్‌ను రవీంద్ర జడేజా ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. కాగా టీమిండియా విజయానికి ఇంకా 6 వికెట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్‌ 24 పరుగులతో ఉండగా,హెన్రీ నికోల్స్ క్రీజులోకి వచ్చాడు.

న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 52 పరుగులు చేసిన టామ్‌ లాథమ్‌నురవిచంద్రన్ అశ్విన్ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. కాగా టీమిండియా విజయానికి ఇంకా 7 వికెట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్‌(7), రాస్‌ టేలర్‌(0) పరుగులతో ఉన్నారు.

12: 58 PM: కివీస్‌ స్కోర్‌: 99/2, భారత్ కంటే ఇంకా 185 పరుగులు వెనుకబడి ఉన్న కివీస్‌. ప్రస్తుతం క్రీజులో టామ్‌ లాథమ్‌(49),విలియమ్సన్‌(7) పరుగులతో ఉన్నారు.

12: 14PM: 79 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 36 పరుగులు చేసిన విలియం సోమర్‌విల్లే, ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో శుభమాన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో టామ్‌ లాథమ్‌(32),విలియమ్సన్‌ ఉన్నారు.
11:30AM: ఐదో రోజు ఆట: లంచ్‌ బ్రేక్‌ సమయానికి న్యూజిలాండ్‌ స్కోరు(సెకండ్‌ ఇన్నింగ్స్‌): ఒక వికెట్‌ నష్టానికి 79 పరుగులు. భారత్ కంటే ఇంకా 205 పరుగులు వెనుకబడి ఉన్న కివీస్‌.

11:18 Am: న్యూజిలాండ్‌ స్కోర్‌: 70/1, ప్రస్తుతం క్రీజులో టామ్‌ లాథమ్‌(32), విలియం సోమర్‌విల్లే(32) పరుగులతో ఉన్నారు. 

10:10 Am: ఐదో రోజు ఆట ప్రారంభించిన కివీస్‌ నిలకడగా ఆడుతుంది. 14 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి న్యూజిలాండ్‌ 32 పరుగులు చేసిందిప్రస్తుతం క్రీజులో టామ్‌ లాథమ్‌(10), విలియం సోమర్‌విల్లే(18) పరుగులతో ఉన్నారు. 

9:30 Am: కాన్పూర్‌ వేదికగా టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో అఖరి  రోజు ఆట ప్రారంభమైంది. కాగా చివరి రోజు ఆట ఆసక్తికరంగా మారింది.  ఇరు జట్లుకు విజయం ఊరిస్తోంది. భారత స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌ అటాక్‌ను ప్రారంభించాడు.

ప్రస్తుతం క్రీజులో టామ్‌ లాథమ్‌, విలియం సోమర్‌విల్లే ఉన్నారు. కాగా భారత్‌.. విజయానికి ఇంకా 9 వికెట్ల దూరంలో నిలవగా, మరోవైపు న్యూజిలాండ్‌ 284 పరుగుల లక్ష్యాన్ని చేధించి గెలుపు రుచి చూడాలని భావిస్తోంది. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి న్యూజిలాండ్‌ 4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 4 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

భారత జట్టు: శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(కెప్టెన్‌) శ్రేయస్ అయ్యర్, శ్రీకర్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌- వృద్ధిమాన్ సాహా స్థానంలో సబ్‌స్టిట్యూట్‌‌), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్.

న్యూజిలాండ్‌ జట్టు:  టామ్‌ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్‌), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(వికెట్‌ కీపర్‌), రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కైల్ జామీసన్, విలియం సోమర్‌విల్లే.

చదవండి: BAN Vs PAK: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్‌ బౌలర్‌.. ఏకంగా 7 వికెట్లు...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top