
కోవిడ్–19 కారణంగా పలు టెస్టు సిరీస్‌లు రద్దయినా ఐసీసీ దీనిపై పునరాలోచన చేయడం లేదు. ‘ఇప్పటి వరకైతే టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తేదీల్లో మార్పు లేదు. అయితే పాయింట్ల కేటాయింపు విషయంలో మార్పులు అవసరమైతే దానిపై దృష్టి పెడతాం. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం’
దుబాయ్: కరోనా కారణంగా క్రికెట్‌కు ఆటంకం కలిగినా... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పష్టం చేసింది. గతంలో ప్రకటించిన విధంగా వచ్చే ఏడాది జూన్‌లోనే దీనిని నిర్వహిస్తామని ప్రకటించింది. కోవిడ్–19 కారణంగా పలు టెస్టు సిరీస్‌లు రద్దయినా ఐసీసీ దీనిపై పునరాలోచన చేయడం లేదు. ‘ఇప్పటి వరకైతే టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తేదీల్లో మార్పు లేదు. అయితే పాయింట్ల కేటాయింపు విషయంలో మార్పులు అవసరమైతే దానిపై దృష్టి పెడతాం. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం’ అని ఐసీసీ అధికార ప్రతినిధి చెప్పారు. షెడ్యూల్ ప్రకారం టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా టాప్–9 జట్లు ఒక్కొక్కటి కనీసం ఆరు సిరీస్‌ల చొప్పున ఆడాల్సి ఉంది. అయితే భారత్, ఇంగ్లండ్ మాత్రమే నాలుగేసి సిరీస్‌లు ఆడగా, ఆస్ట్రేలియా మూడు సిరీస్‌లలో పాల్గొంది.
(చదవండి: ధోనిపై విమర్శలకు, ఫ్యాన్ సమాధానం)