'శాస్త్రి ఆ విషయం నాకు ముందే చెప్పాడు'

Ian Chappell Reveals Shastri Told Him About Indias Third Seamer - Sakshi

ముంబై : ఆసీస్‌తో జరగనున్న నాలుగు టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు డిసెంబర్‌ 17 నుంచి అడిలైడ్‌ వేదికగా ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్‌ కూర్పులో మూడో సీమర్‌ ఎవరనే దానిపై చర్చ నడుస్తుంది. అయితే ఆసీస్‌తో జరగబోయే తొలి టెస్టులో మూడో పేసర్‌ ఎవరన్నది తనకు తెలుసని ఆసీస్‌ మాజీ ఆటగాడు ఇయాన్‌ చాపెల్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతమున్న అనుభవం దృష్యా ఉమేశ్‌ యాదవ్‌కే మూడో పేసర్‌గా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిపాడు. (చదవండి : డ్రింక్స్‌ తాగడానికే ఐపీఎల్‌కు వచ్చేవాడు : సెహ్వాగ్‌)

'టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రితో కలిసి సరదాగా డ్రింక్‌ తాగుతున్న సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చింది. తొలి టెస్టుకి టీమిండియాలో మూడో పేసర్‌ అవసరం ఉందని.. ఇషాంత్‌ గైర్హాజరీలో అనుభవం దృష్యా ఉమేశ్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని శాస్త్రి నాతో చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టులో మహ్మద్‌ షమీ, బుమ్రాలు కీలకంగా మారారని.. ఉమేశ్‌ లాంటి బౌలర్‌ ఉంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియా తొలి టెస్టును డే నైట్‌లో ఆడడం సానుకూలాశంగా మారనుంది. ఒకవేళ భారత్‌ మొదటి బ్యాటింగ్‌ చేసి 300 పరుగులు సాధిస్తే గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. మొదటి టెస్టు తర్వాత కోహ్లి స్వదేశానికి వెళ్లనున్ననేపథ్యంలో టీమిండియాకు మిగిలిన టెస్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యే చాన్స్‌లు ఉన్నాయి. కాగా కోహ్లి స్థానంలో అజింక్యా రహానే మిగిలిన మూడు టెస్టులకు కెప్టెన్‌గా పనిచేయనున్నాడు.(చదవండి : ‘కోహ్లిని పక్కకు పెట్టి ఒత్తిడి తగ్గించండి’)

వాస్తవానికి ఆసీస్‌ టూర్‌కు మొదట ఇషాంత్‌ శర్మ మూడో పేసర్‌గా ఎంపికయ్యాడు. అయితే ఐపీఎల్‌ 13వ సీజన్‌ సందర్భంగా ఇషాంత్‌ గాయపడడంతో ఆసీస్‌ టూర్‌ నుంచి తప్పించారు. అతని స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ను తీసుకున్నారు. ప్రస్తుతం టీమిండియా పేస్‌ బౌలింగ్‌ దళంలో షమీ, బుమ్రాలతో పాటు ఉమేశ్‌ యాదవ్‌, నవదీప్‌ సైనీ, మహ్మద్‌ సిరాజ్‌లు ఉన్నారు. 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top