శ్రీలంక 169 ఆలౌట్‌

Holder, Roach give West Indies the advantage in first SL Test - Sakshi

నార్త్‌సౌండ్‌: వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్, పేస్‌ బౌలర్‌ జేసన్‌ హోల్డర్‌ (5/27) నిప్పులు చెరగడంతో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. ఫలితంగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 69.4 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను తొలుత కీమర్‌ రోచ్‌ (3/47) దెబ్బ తీయగా... అనంతరం జేసన్‌ హోల్డర్‌ హడలెత్తించడంతో శ్రీలంక ఇన్నింగ్స్‌కు తెర పడింది. లహిరు తిరిమన్నే (70; 4 ఫోర్లు), డిక్‌వెల్లా (32; 2 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ రెండో రోజు కడపటి వార్తలు అందే సమయానికి 67 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి ఆధిక్యం సంపాదించే దిశగా సాగుతోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top