చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా | Highest Successful IPL Chase: Punjab Kings Beats Their Own Record | Sakshi
Sakshi News home page

IPL 2026: చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

Apr 25 2026 8:22 PM | Updated on Apr 25 2026 9:02 PM

Highest Successful IPL Chase: Punjab Kings Beats Their Own Record

ఐపీఎల్‌-2026లో పంజాబ్ కింగ్స్ అద్భుతం చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ రికార్డు విజయం సాధించింది. ఢిల్లీ నిర్ధేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో ఊదిపడేసింది.

తద్వారా టీ20 క్రికెట్‌లో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పంజాబ్‌ తమ రికార్డును తామే బ్రేక్ చేసింది. అంతకముందు ఐపీఎల్‌-2024 సీజన్‌లో కేకేఆర్ నిర్ధేశించిన 262 రన్స్ టార్గెట్‌ని పంజాబ్ ఛేజ్ చేసింది.

దంచి కొట్టిన పంజాబ్ ఓపెనర్లు
265 పరుగుల భారీ లక్ష్య చేధనలో పంజాబ్‌కు ఓపెనర్లు  ప్రభ్‌సిమ్రన్ సింగ్ (76; 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), ప్రియాంశ్ ఆర్య (43; 17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరి ధాటికి పంజాబ్ పవర్‌ప్లేలోనే ఏకంగా 116 పరుగులు చేసింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన  కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (71 నాటౌట్‌; 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. నేహల్ వధేరా (25), శశాంక్ సింగ్ (19 నాటౌట్‌) దూకుడుగా ఆడారు. ఫలితంగా ఈ చారిత్రత్మక విజయాన్ని పంజాబ్ విజయాన్ని అందించాడు. అయితే ఈమ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను ఢిల్లీ ఫీల్డర్ కరుణ్ నాయర్ విడిచిపెట్టాడు. దీంతో ఢిల్లీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

రాహుల్ సూపర్ సెంచరీ
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 264 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (152 నాటౌట్; 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు నితీష్ రాణా(44 బంతుల్లో 91) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

టీ20 చరిత్రలో అత్యధిక రన్ ఛేజ్‌లు ఇవే
పంజాబ్ కింగ్స్- 265/4- ప్రత్యర్ధి- ఢిల్లీ క్యాపిటల్స్‌
పంజాబ్ కింగ్స్‌-262/2- ప్రత్యర్ధి-కేకేఆర్‌
సౌతాఫ్రికా- 259/4- ప్రత్యర్ధి- వెస్టిండీస్‌
బ్రిస్బేన్ హీట్‌-258/2- ప్రత్యర్ధి- పెర్త్ స్కార్చర్స్
 

Advertisement
 
Advertisement
Advertisement