IPL 2023: ఈ మాత్రం ఆటకేనా 13 కోట్లు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో

Harry Brook nightmarish IPL 2023 continues, fans troll - Sakshi

ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో ఓటమి చవి చూసింది. ఉప్పల్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో సన్‌రైజర్స్‌ చతికిలబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది.

ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో మయాంక్‌ అగర్వాల్‌(49) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్‌ పటేల్‌(34),మనీష్‌ పాండే(34) పరుగులతో టాప్‌ స్కోరర్లగా నిలిచారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ మూడు వికెట్లు సాధించగా.. భువనేశ్వర్‌ కుమార్‌ రెండు,,నటరాజన్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు.

తీరు మారని బ్రూక్‌
ఇక కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన హ్యారీ బ్రూక్‌.. ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో 14 బంతులు ఎదుర్కొన్న బ్రూక్‌ 7 పరుగులు మాత్రమే చేశాడు. నోర్జే బౌలింగ్‌లో అనవసరపు షాట్‌ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. అంతకుముందు సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లోనూ బ్రూక్‌ దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన  బ్రూక్‌ 163 పరుగులు చేశాడు. 

అందులో కేకేఆర్‌తో మ్యాచ్‌లో చేసిన 100 పరుగులే అత్యధికంగా ఉన్నాయి. అంటే మిగితా 6 మ్యాచ్‌ల్లో అతడు కేలం 63 పరుగులు మాత్రమే చేశాడు. ఇక దారుణంగా విఫలమవుతున్న బ్రూక్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నాను. ఇంగ్లండ్‌కు వెళ్లి టెస్టులు ఆడుకో పో అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి కొంత మంది సెంచరీ కొడితే హీరో అన్నారు.. ఇప్పుడు జీరోనా? అంటూ  కామెంట్లు చేస్తున్నారు.కాగా ఈ ఏడాది సీజన్‌కు ముందు జరిగిన మినీవేలంలో హ్యారీ బ్రూక్‌ను  రూ.13.25 కోట్లు పెట్టి మరి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2023: సన్‌రైజర్స్‌ను ఓడించి, ఢిల్లీని గెలిపించింది అతనే..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top