Harmanpreet Kaur: 'ఇప్పుడే సరైనోడి చేతుల్లోకి వెళ్లాం'.. టీమిండియా కెప్టెన్‌ కౌంటర్‌

Harmanpreet Kaur Indirect Dig At Former Head Coach Ramesh Powar - Sakshi

భారత మహిళల జట్టు మాజీ హెడ్‌కోచ్‌ రమేశ్‌ పవార్‌పై కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నవంబర్‌ 6న బీసీసీఐ రమేశ్‌ పొవార్‌ను భారత మహిళల జట్టు హెడ్‌కోచ్‌ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు గ్రూప్‌ దశలోనే వెనుదిరగడం పొవార్‌ను కోచ్‌ పదవి నుంచి తప్పించడానికి ప్రధాన కారణమయింది. ఇక బ్యాటింగ్‌ కోచ్‌గా హృషికేష్‌ కనిత్కర్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ రమేశ్‌ పొవార్‌ను ఎన్‌సీఏకు బదిలీ చేసింది. ఇకపై ఎన్‌సీఏ హెడ్‌గా ఉన్న వీవీఎస్‌ లక్ష్మణ్‌తో పొవార్‌ కలిసి పనిచేస్తాడని బీసీసీఐ తెలిపింది.

ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మాత్రం రమేశ్‌ పొవార్‌పై పరోక్షంగా కౌంటర్‌ వేసింది. ఇండియా, ఆస్ట్రేలియా వుమెన్స్‌ ద్వైపాక్షిక సిరీస్‌ సందర్భంగా హర్మన్‌ప్రీత్‌ మీడియాతో మాట్లాడింది. ఇప్పుడు మేం సరైన వ్యక్తి చేతుల్లో ఉన్నాం అంటూ తెలిపింది. అయితే పొవార్‌ను ఉద్దేశించే హర్మన్‌ ప్రీత్‌ ఇలా వ్యాఖ్యలు చేసిందంటూ కొంతమంది పేర్కొన్నారు.

అయితే పొవార్‌ను కోచ్‌ పదవి నుంచి తప్పించడం వెనుక హర్మన్‌ప్రీత్‌ హస్తం ఉందని హిందుస్థాన్‌ టైమ్స్‌ ఆరోపణలు చేసింది. పొవార్‌ను కోచ్‌ పదవి నుంచి తొలగించాలంటూ బీసీసీఐ సెక్రటరీ జై షాకు స్వయంగా లేఖ రాసినట్లు తెలిసింది. అయితే టీమిండియా మహిళా జట్టుకు పొవార్‌పై ముందు నుంచి మంచి అభిప్రాయం లేదు.

ఇంతకముందు 2018 టి20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌ సందర్భంగా అప్పటికి మంచి ఫామ్‌లో ఉన్న మిథాలీరాజ్‌ను పొవార్‌ పక్కనబెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. మిథాలీ రిటైర్మెంట్‌ తర్వాత తన పుస్తకంలోనూ రమేశ్‌ పొవార్‌తో ఉన్న విబేధాలను బయటపెట్టింది. హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి చాలాసార్లు వివాదాల్లో నిలిచాడు. అందుకే హర్మన్‌ప్రీత్‌ స్వయంగ రంగంలోకి దిగి బీసీసీఐకి లేఖ రాసినట్లు సమాచారం. 

ఇక కొత్త హెడ్‌కోచ్‌ ఎవరనే దానిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం హెడ్‌కోచ్‌ లేకుండానే ఆస్ట్రేలియాతో సిరీస్‌ ఆడనుంది. అయితే 2021లో హృషికేష్‌ కనిత్కర్‌ హెడ్‌కోచ్‌ పదవికి అప్లై చేసినప్పటికి అతనికి అవకాశం రాలేదు. తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌కు మాత్రం హృషికేష్‌ కనిత్కర్‌కు బ్యాటింగ్‌ కోచ్‌గా టీమిండియా మహిళల జట్టుకు పనిచేసే అవకాశం లభించింది.

చదవండి: ఓటమికి నైతిక బాధ్యత.. రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ ఫుట్‌బాలర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top