హర్మన్‌ ధనాధన్‌ హాఫ్‌ సెంచరీ.. ప్లే ఆఫ్స్‌కు ముంబై 

Fifth win in a row in WPL for Mumbai Indians - Sakshi

డబ్ల్యూపీఎల్‌లో వరుసగా ఐదో విజయం

రాణించిన సీవర్, హేలీ

55 పరుగులతో ఓడిన గుజరాత్‌  

ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఓటమెరుగని ముంబై ఇండియన్స్‌ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం 55 పరుగుల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. ముంబైకిది వరుసగా ఐదో విజయం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (30 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ అర్ధసెంచరీ బాదింది.

ఓపెనర్‌ యస్తిక భాటియా (37 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా, గుజరాత్‌ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నెర్‌ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం గుజరాత్‌ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 107 పరుగులే చేయగలిగింది. హర్లీన్‌ డియోల్‌ (23 బంతుల్లో 22; 3 ఫోర్లు), కెపె్టన్‌ స్నేహ్‌ రాణా (19 బంతుల్లో 20; 3 ఫోర్లు) కష్టంగా రెండు పదుల స్కోరు దాటారు. మిగతావారంతా చేతులెత్తేశారు.

నట్‌ సీవర్‌    బ్రంట్, హేలీ మాథ్యూస్‌ చెరో 3 వికెట్లు తీయగా, అమెలియా కెర్‌కు 2 వికెట్లు దక్కాయి. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతుంది. 

స్కోరు వివరాలు 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: యస్తిక (రనౌట్‌) 44; హేలీ (సి) డన్‌క్లే (బి) గార్డ్‌నెర్‌ 0; నట్‌ సీవర్‌ (ఎల్బీ) (బి) గార్త్‌ 36; హర్మన్‌ప్రీత్‌ (సి) హర్లీన్‌ (బి) గార్డ్‌నెర్‌ 51; అమెలియా (సి) గార్త్‌ (బి) కన్వార్‌ 19; ఇసి వాంగ్‌ (సి అండ్‌ బి) స్నేహ్‌ రాణా 0; హుమైరా (రనౌట్‌) 2; ధార (నాటౌట్‌) 1; అమన్‌జోత్‌ (సి) డన్‌క్లే (బి) గార్డ్‌నెర్‌ 0; కలిత (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 7, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–1, 2–75, 3–84, 4–135, 5–136, 6–145. బౌలింగ్‌: గార్డ్‌నెర్‌ 4–0–34–3, కిమ్‌ గార్త్‌ 4–0–31–1, స్నేహ్‌ రాణా 4–0–17–1, తనూజ 4–0–32–1, అనాబెల్‌ 4–0–42–0. 
గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: సోఫియా (ఎల్బీ) (బి) నట్‌ సీవర్‌ 0; మేఘన (సి) నట్‌ సీవర్‌ (బి) హేలీ 16; హర్లీన్‌ (ఎల్బీ) (బి) వాంగ్‌ 22; అనాబెల్‌ (ఎల్బీ) (బి) హేలీ 0; గార్డ్‌నెర్‌ (సి) కలిత (బి) అమెలియా 8; స్నేహ్‌ (ఎల్బీ) (బి) నట్‌ సీవర్‌ 20; హేమలత (సి) వాంగ్‌ (బి) అమెలియా 6; సుష్మ (నాటౌట్‌) 18; గార్త్‌ (సి) హర్మన్‌ (బి) నట్‌ సీవర్‌ 8; తనూజ (సి) యస్తిక (బి) హేలీ 0; మాన్సి (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 107. వికెట్ల పతనం: 1–0, 2–34, 3–34, 4–48, 5–48, 6–57, 7–85, 8–95, 9–96. బౌలింగ్‌: నట్‌ సీవర్‌ 4–0–21–3, సయిక 4–0–20–0, ఇసి వాంగ్‌ 3–0–19–1, హేలీ మాథ్యూస్‌ 4–0–23–3, అమెలియా కెర్‌ 4–0–18–2, అమన్‌జోత్‌ 1–0–6–0.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top