ఫిఫా అండర్‌-17 వరల్డ్‌ కప్‌.. లీగ్‌ దశలోనే భారత్‌ అవుట్‌ | FIFA U-17 Women World Cup: IND Lose 0-3 Vs Morocco Knocked out Tourney | Sakshi
Sakshi News home page

FIFA U-17 Women World Cup: లీగ్‌ దశలోనే భారత్‌ అవుట్‌ 

Oct 15 2022 7:25 AM | Updated on Oct 15 2022 7:28 AM

FIFA U-17 Women World Cup: IND Lose 0-3 Vs Morocco Knocked out Tourney - Sakshi

భువనేశ్వర్‌: ప్రపంచ అండర్‌–17 మహిళల ఫుట్‌బాల్‌ టోర్నీలో ఆతిథ్య భారత జట్టు మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. గ్రూప్‌ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో 0–8తో ఓడిన భారత్‌... శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 0–3తో మొరాకో చేతిలో పరాజయం పాలైంది. మొరాకో తరఫున దోహా ఎల్‌ మదానీ (51వ ని.లో), యాస్మీన్‌ జౌహర్‌ (62వ ని.లో), జెనా షరీఫ్‌ (90+1వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు.

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్‌ ఈనెల 17న జరిగే నామమాత్రపు చివరి లీగ్‌ మ్యాచ్‌లో బ్రెజిల్‌తో ఆడుతుంది. బ్రెజిల్, అమెరికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. ప్రస్తుతం బ్రెజిల్, అమెరికా నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో... మూడు పాయింట్లతో మొరాకో రెండో స్థానంలో ఉంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement