ఐపీఎల్-2024 తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కార్తీక్ అదరగొట్టాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన డీకే.. తన ఖాతార్నాక్ ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు. మరో యువ ఆటగాడు అనుజ్ రావత్‌తో కలిసి తన జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్‌ను అందించాడు. ఆరో వికెట్‌కు రావత్‌తో కలిసి 95 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఓవరాల్‌గా 26 బంతులు ఎదుర్కొన్న కార్తీక్.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 38 ఏళ్ల కార్తీక్ కొట్టిన 2 సిక్సర్ల కూడా మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా ఈ ఏడాది సీజన్ తర్వాత ఐపీఎల్‌కు కార్తీక్ గుడ్‌బై చేప్పే అవకాశముంది. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18. 4 ఓవర్లలో ఛేదించింది. సీఎస్‌కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శివమ్ దూబే(34 నాటౌట్), రవీంద్ర జడేజా(25 నాటౌట్) రాణించారు.
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కార్తీక్‌తో పాటు అనుజ్ రావత్(48) పరుగులతో రాణించాడు. సీఎస్‌కే బౌలర్లలో ముస్తుఫిజర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్ ఒక్క వికెట్ సాధించాడు.
All heads must bow, all lips must confess...
— VJ17 (@ABDszn17) March 22, 2024
ANUJ RAWAT AND DINESH KARTHIK ARE THE GREATEST DUO IN THE HISTORY OF IPL.🐐🐐pic.twitter.com/zKwLc4rKNW

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
