IPL 2023 Mini Auction: ఐపీఎల్ వేలంలోకి వారిద్దరూ ఎంట్రీ.. రికార్డులు బద్దలు కావాల్సిందే!

ఐపీఎల్-2023 మినీ వేలానికి సమయం అసన్నమవుతోంది. డిసెంబర్ 23న కొచ్చి వేదికగా ఈ మినీ వేలం జరగనుంది. ఈ మినీవేలంలో మొత్తంగా 991 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 21 మంది తమ బేస్‌ప్రైజ్ రూ. 2 కోట్లగా నమోదు చేసుకున్నారు. ఈ జాబితాలో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రాన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. కాగా ఈ లిస్టులో భారత్ నుంచి ఒక్క ఆటగాడి పేరు కూడా లేకపోవడం గమనార్హం.
బెన్ స్టోక్స్, సామ్ కర్రాన్‌కు భారీ ధర ఖాయం!
ఈ ఏడాది ఐపీఎల్ దూరమైన ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, సామ్ కర్రాన్ కోసం మినీ వేలంలో ప్రాంఛైజీలు పోటీపోడే అవకాశం ఉంది. కాగా గతేడాది చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సామ్ కర్రాన్‌ను మళ్లీ అదే ఫ్రాంచైజీ దక్కించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
అదే విధంగా కేన్ విలియమ్సన్ విడిచి పెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. స్టోక్స్‌ను ఈ వేలంలో ఎలాగైనా సొంతం చేసుకుని సారథ్య బాధ్యతలు అప్పజెప్పాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏదైనా గానీ వీరిద్దరికి మాత్రం వేలంలో భారీ ధర దక్కడం ఖాయంగా కన్పిస్తోంది.
ఇక వీరిద్దరూ ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఫైనల్లో సంచలన ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌ను బెన్ స్టోక్స్ విజేతగా నిలపగా.. సామ్ కర్రాన్ టోర్నీ ఆసాంతం అదరగొట్టాడు. ఇక ఈ మెగా టోర్నీలో మొత్తం 13 వికెట్లు పడగొట్టిన కర్రాన్.. ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు.
చదవండి: ENG vs PAK 1ST Test: 17 ఏళ్ల తర్వాత తొలి టెస్టు మ్యాచ్.. 657 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు