ENG vs PAK 1ST Test: 17 ఏళ్ల తర్వాత తొలి టెస్టు మ్యాచ్.. 657 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరగుతోన్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించింది. 101 ఓవర్లలో ఇంగ్లండ్ 657 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ(122), బెన్ డక్కట్ (107), ఓలీ పోప్(108), హ్యారీ బ్రూక్ (153) సెంచరీలతో చెలరేగారు. 506/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 151 పరుగులు చేసి ఆలౌటైంది.
పాకిస్తాన్ బౌలర్లలో స్పిన్నర్ జహీద్ ఆహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. నషీం షా మూడు వికెట్లు, మహ్మద్ అలీ రెండు, హారీష్ రఫ్ ఒక్క వికెట్ సాధించారు. కాగా 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై తొలి టెస్టు మ్యాచ్ ఇంగ్లండ్ ఆడుతోంది. అయితే ఈ చారిత్రత్మక టెస్టు తొలి రోజు పాకిస్తాన్ బౌలర్లకు ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.
టీ20 తరహాలో ఆడిన ఇంగ్లీష్ బ్యాటర్లు తొలి రోజు ఏకంగా 506 పరుగులు రాబట్టారు. ఇక తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాకిస్తాన్ లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది.
చదవండి: IPL Mini Auction: రూ.2 కోట్ల కనీస ధర కలిగిన ఆటగాళ్లు వీరే! ఒక్క భారత క్రికెటర్ కూడా
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు