చేరో ఆర్చర్స్‌ ఖాతాలో మూడో విజయం | Chero Archers claim third win in Archery Premier League season 2 | Sakshi
Sakshi News home page

చేరో ఆర్చర్స్‌ ఖాతాలో మూడో విజయం

Oct 12 2026 4:37 AM | Updated on Oct 12 2026 4:37 AM

Chero Archers claim third win in Archery Premier League season 2

సాక్షి, హైదరాబాద్‌: ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌లో చేరో ఆర్చర్స్, పృథ్వీరాజ్‌ యోధాస్‌ జట్లు మూడో విజయం నమోదు చేసుకున్నాయి. ఆదివారం నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో జరిగిన మ్యాచ్‌ల్లో చేరో ఆర్చర్స్‌ 6–0తో కాకతీయ నైట్స్‌ జట్టుపై, పృథ్వీరాజ్‌ యోధాస్‌ 6–2తో చోళా చీఫ్స్‌ జట్టును ఓడించాయి. 

మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ రాజ్‌పుతానా రాయల్స్‌ తమ నిరాశాజనక ఆటతీరును కొనసాగిస్తూ మూడో ఓటమిని చవిచూసింది. మైటీ మరాఠాస్‌ 5–3తో రాజ్‌పుతానా రాయల్స్‌ను ఓడించింది. నేడు జరిగే మూడు మ్యాచ్‌ల్లో మైటీ మరాఠాస్‌తో చేరో ఆర్చర్స్‌; రాజ్‌పుతానా రాయల్స్‌తో చోళా చీఫ్స్‌; కాకతీయ నైట్స్‌తో పృథ్వీరాజ్‌ యోధాస్‌ తలపడతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement