చెలరేగిన అభిషేక్‌.. విండీస్‌పై టీమిండియా విక్టరీ | India beat west indies in 3rd T20I | Sakshi
Sakshi News home page

చెలరేగిన అభిషేక్‌.. విండీస్‌పై టీమిండియా విక్టరీ

Oct 11 2026 10:47 PM | Updated on Oct 11 2026 10:47 PM

India beat west indies in 3rd T20I

source: X

ఇండోర్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది.

ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (30 బంతుల్లో 69; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకంతో విరుచుకుపడగా.. ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 37; 6 ఫోర్లు, సిక్స్‌), తిలక్‌ వర్మ (28), నితీశ్‌ కుమార్‌ (21), అక్షర్‌ పటేల్‌ (20) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆఖర్లో నమన్‌ ధిర్‌ (10), అర్షదీప్‌ సింగ్‌ (11), ప్రిన్స్‌ యాదవ్‌ (13 నాటౌట్‌) కూడా బ్యాట్‌ ఝులిపించారు.

సంజూ శాంసన్‌ (3), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (1) నిరాశపరిచారు. విండీస్‌ బౌలర్లలో ఛేజ్‌, షమార్‌ జోసఫ్‌, షమార్‌ స్ప్రింగర్‌ తలో 2 వికెట్లు తీయగా.. కీమో పాల్‌, గుడకేశ్‌ మోటీ చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో విండీస్‌ చివరి వరకు పోరాడింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేయగలిగింది. కమిల్‌ పూరన్‌ (42), హెట్‌మైర్‌ (43), రూథర్‌ఫోర్డ్‌ (32) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగా.. ఆఖర్లో షమార్‌ స్ప్రింగర్‌ (35 నాటౌట్‌)  విండీస్‌ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. భారత బౌలర్లలో అర్షదీప్‌ 3, నమన్‌ ధిర్‌ 2, అక్షర్‌ పటేల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి తలో వికెట్‌ పడగొట్టాడు. నాలుగో టీ20 అక్టోబర్‌ 14న హైదరాబాద్‌లో జరుగనుంది.

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ.. ప్రపంచ రికార్డు బద్దలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement