విచిత్రమైన బౌలర్‌.. వికెట్‌ తీసి కామెంటరీ చేశాడు; వీడియో వైరల్‌

Bowler Hilariously Turns Commentator Celebrate After Picking Up Wicket - Sakshi

లండన్‌: క్రికెట్‌లో ఒక బౌలర్‌ వికెట్‌ తీస్తే సెలబ్రేట్‌ చేసుకోవడం సాధారణం. అందులో కొంతమంది మాత్రం తాము ఏం చేసినా ప్రత్యేకంగా ఉండాలని భావిస్తుంటారు. ఉదాహరణకు స్టెయిన్‌ వికెట్‌ తీస్తే చెయిన్‌ సా రియాక్షన్‌ ఇవ్వడం.. ఇమ్రాన్‌ తాహిర్‌ వికెట్‌ తీస్తే గ్రౌండ్‌ మొత్తం పరుగులు తీయడం.. విండీస్‌ బౌలర్‌ కాట్రెల్‌ వికెట్‌ తీసిన తర్వాత సెల్యూట్‌ చేయడం అలవాటు. ఎవరి సెలబ్రేషన్‌ ఎలా ఉన్నా వాటిని చూసే మనకు మాత్రం వినోదం లభించడం గ్యారంటీ. తాజాగా క్లబ్‌ క్రికెట్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది.

ఈసీఎస్‌ టీ10 టోర్నీ సందర్బంగా బనేసా, బుకారెస్ట్ గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో బుకారెస్ట్‌ గ్లాడియేటర్స్‌ స్పిన్నర్‌ పావెల్‌ ఫ్లోరిన్‌ వికెట్‌ తీసిన ఆనందంలో తనదైన శైలిలో సెలబ్రేట్‌ చేసుకున్నాడు. పావెల్‌ వేసిన లూప్‌ డెలివరీని అంచనా వేయడంలో పొరబడ్డ బ్యాట్స్‌మన్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పావెల్‌ పిచ్‌పై నుంచి పెవిలియన్ వైపు పరిగెత్తాడు. బౌండరీ చివరల్లో ఆగుతాడునుకుంటే ఎవరు ఊహించని విధంగా కామెంటేటరీ సెక్షన్‌లోకి వెళ్లి.. '' నేను వికెట్‌ తీశాను.. నా బౌలింగ్‌ ఎలా ఉంది'' అంటూ గట్టిగా అరిచాడు. ఆ తర్వాత మళ్లీ గ్రౌండ్‌లోకి వచ్చి బౌలింగ్‌ను కంటిన్యూ చేశాడు. అతని చర్యలకు సహచర ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లు నవ్వుకున్నారు. ఏది ఏమైనా పావెల్‌ ఫ్లోరిన్‌ చేసిన పని నెటిజన్లను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఒక వికెట్‌ తీసినంత మాత్రానా ఇంత చేయాల్సిన  అవసరం ఉందా అంటూ కొందరు ఘాటుగా పేర్కొన్నారు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top