Indian Wells Masters 2021: క్వార్టర్ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ జంట

Indian Wells Masters 2021: ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కాలిఫోర్నియాలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 7–5, 6–3తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్–అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) జోడీపై గెలిచింది. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి ద్వయం సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది.