భారత జెర్సీలో మహ్మద్ షమీ
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో ఢిల్లీతో జరగబోయే తమ తొలి మ్యాచ్ కోసం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి కూడా ఈ జట్టులో చోటు లభించింది.
గత సీజన్‌లో సెంచరీలతో అదరగొట్టిన బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామీకి బెంగాల్ క్రికెట్ బోర్డు ప్రమోషన్ ఇచ్చింది. అభిమన్యు ఈశ్వరన్‌కు డిప్యూటీగా సుదీప్ కుమార్‌ను నియమించింది. వీరితో పాటు యువ ఆటగాళ్లు ప్రదీప్త ప్రామాణిక్, అంకుర్ పాల్, సుమంత గుప్తా కూడా జట్టులో స్థానం దక్కించుకున్నారు. పేస్ బౌలింగ్‌లో షమీతో పాటు ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్, సూరజ్ సింధు జైస్వాల్, ఎండీ కైఫ్‌లతో బెంగాల్ పేస్ విభాగం బలంగా కనిపిస్తోంది. కాగా లైంగిక వేధింపుల కేసులో బెయిల్ పొందిన అభిషేక్ పోరెల్‌కు ఈ జట్టులో చోటు దక్కడం గమనార్హం.
షమీ రీఎంట్రీ ఇస్తాడా!
ఇప్పటివరకు తన కెరీర్‌లో 100 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 384 వికెట్లు పడగొట్టిన మహ్మద్ షమీ, ఈ రంజీ సీజన్‌లో అద్భుతంగా రాణించి తిరిగి జాతీయ జట్టులోకి పునరాగమనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత భారత జట్టు ఎంపికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
షమీ సహచరుడు, 'స్వింగ్ కింగ్' భువనేశ్వర్ కుమార్‌కు నాలుగేళ్ల విరామం తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు జాతీయ జట్టులో చోటు దక్కింది. దీంతో రంజీల్లో రాణిస్తే షమీకి కూడా త్వరలోనే భారత జట్టు తలుపులు తెరుచుకుంటాయని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బెంగాల్ రంజీ ట్రోఫీ జట్టు:
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సుదీప్ కుమార్ ఘరామీ (వైస్ కెప్టెన్), సుదీప్ చటర్జీ, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), షాకిర్ హబీబ్ గాంధీ (వికెట్ కీపర్), అంకుర్ పాల్, సుమంత గుప్తా, అంకిత్ శుక్లా, శుభమ్ చటర్జీ, మహమ్మద్ షమీ, ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్, సూరజ్ సింధు జైస్వాల్, ప్రదీప్త ప్రామాణిక్, అమీర్ గని, ఎండీ కైఫ్, సౌమ్యదీప్ మౌండల్.
చదవండి: దంచికొట్టిన వార్నర్.. బంగ్లాదేశ్‌పై ఆసీస్ ఘన విజయం


