Axar Patel Shares Lovely Photos With Fiance Meha, Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Axar Patel: కాబోయే భార్యతో సాగర తీరంలో టీమిండియా ఆల్‌రౌండర్‌.. ఫొటోలు వైరల్‌

Aug 10 2022 2:08 PM | Updated on Aug 10 2022 4:28 PM

Axar Patel Gets Romantic With Fiance Meha Shares Photos Goes Viral - Sakshi

Axar Patel- Meha Photos: టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ హాలిడే మూడ్‌లో ఉన్నాడు. కాబోయే భార్య మెహా పటేల్‌తో కలిసి రొమాంటిక్‌ డేట్‌కు వెళ్లాడు. ఇద్దరూ కలిసి సాగర తీరాన బీచ్‌ అందాలు ఆస్వాదిస్తూ ప్రేమలోకంలో విహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మెహా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

కాబోయే భర్త అక్షర్‌ను హత్తుకుని ఉన్న ఫొటోలు షేర్‌ చేస్తూ.. ‘‘నువ్వు అలవి కాదు.. ఆ సముద్రంలోని భాగానివి’’ అంటూ క్యాప్షన్‌ జత చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా ఈ ఏడాది జనవరి 20న అక్షర్‌ పటేల్‌- మేహా పటేల్‌ల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. 

ఈ ఏడాది ఆరంభంలో ఎంగేజ్‌మెంట్‌!
చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమించిన అక్షర్‌ తన 28వ పుట్టినరోజున ఆమె వేలికి ఉంగరం తొడిగి ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. త్వరలోనే వీరి పెళ్లి జరుగనున్నట్లు సమాచారం. ఇక ఇటీవల బ్యాటింగ్‌తోనూ రాణిస్తున్న అక్షర్‌ పటేల్‌ తన ఆల్‌రౌండ్‌ ప్రతిభతో టీమిండియా విజయాల్లో కీలక భాగస్వామిగా మారాడు.

వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా రెండో వన్డేల్లో ఆఖరి బంతికి సిక్సర్‌ బాది టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు. తద్వారా కరేబియన్‌ గడ్డపై విండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన జట్టుగా శిఖర్‌ ధావన్‌ సేన నిలవడంలో తన వంతు సాయం చేశాడు.

అయితే, ఆసియా కప్‌-2022 టోర్నీ నేపథ్యంలో అక్షర్‌ పటేల్‌కు నిరాశే ఎదురైంది. ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌కు జట్టులో చోటు దక్కలేదు. స్టాండ్‌బైగా అక్షర్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. ఇక ఆగష్టు 27 నుంచి ఆసియా కప్‌ ఈవెంట్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.

చదవండి: Asia Cup 2022: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే! టాప్‌ స్కోరర్లను వదిలేసి..
Trent Boult: న్యూజిలాండ్‌ క్రికెట్‌కు భారీ షాక్‌.. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పుకున్న స్టార్‌ బౌలర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement