Shane Warne: దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ హఠాన్మరణం

Australia Legend Shane Warne Dies of Suspected Heart Attack - Sakshi

ఆస్ట్రేలియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ గుండెపోటుతో  హఠాన్మరణం చెందాడు. థాయిలాండ్‌లోని తన విల్లాలో తీవ్ర గుండెనొప్పితో బాధపడుతూ మరణించినట్లు తెలుస్తోంది. షేన్ తన విల్లాలో అచేతనంగా పడి ఉండటం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వార్న్ మరణ వార్త తెలిసి.. క్రికెట్ ప్రముఖులతో పాటు ఆయన ఫ్యాన్స్ దిగ్భ్రాంతి గురవుతున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మేటి స్పిన్నర్‌గా పేరుపొందిన షేన్‌ వార్న్‌ ఆస్ట్రేలియా తరపున 1992లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. సమకాలీన క్రికెట్‌లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్‌ వార్న్‌ నిలిచాడు. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ ఉన్న సంగతి తెలిసిందే. 

ఇక క్రికెట్‌లో లెక్కలేనన్ని రికార్డులు షేన్‌ వార్న్‌ సొంతం. టెస్టుల్లో 37 సార్లు 5 వికెట్ల హాల్‌ అందుకున్నాడు. అనూహ్యంగా బంతి తిప్పడంలో మేటి అయిన వార్న్‌.. 2013లో ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌గా నిలిచాడు. 1999 వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో వార్న్‌ సభ్యుడిగా ఉన్నాడు. ఇక ఐపీఎల్‌తోనూ షేన్‌ వార్న్‌కు అనుబంధం ఉంది. 2008 ఆరంభ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు వార్న్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో రాజస్తాన్‌ టైటిల్‌ గెలవడంలో అటు కెప్టెన్‌గా.. ఆటగాడిగా షేన్‌ వార్న్‌ కీలకపాత్ర పోషించాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top