WTC FINAL RACE: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా! మరి టీమిండియా సంగతి?

Australia confirm WTC Final spot, India,SA And Sri Lanka in race for 2nd spot - Sakshi

సిడ్నీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను ఆస్ట్రేలియా దాదాపు ఖారారు చేసుకుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 75.56 శాతంతో తమ ఆగ్ర స్థానాన్ని మరింత సుస్ధిరం చేసుకుంది.

అదే విధంగా  రెండో స్థానం కోసం పోటీ పడుతున్న సౌతాఫ్రికా ఇప్పుడు 48.72 శాతంతో నాలుగో స్థానానికి పడిపోయింది. మూడో స్థానంలో శ్రీలంక 55.33 శాతంతో ఉంది. ఇక బంగ్లాదేశ్‌పై సిరీస్‌ విజయంతో టీమిండియా 99 పాయింట్లతో 58.93 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఐదో స్థానంలో 46.97 శాతంతో ఇంగ్లండ్‌ ఉంది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్‌ చేరాలంటే..
ఆసీస్‌ చేతిలో 0-2 తేడాతో సౌతాఫ్రికా ఓడిపోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్‌ చేరడం మరింత సులభం అయింది. కానీ మూడో స్థానంలో ఉన్న శ్రీలంక నుంచి టీమిండియాకు ముప్పు పొం‍చి ఉంది.

అయితే స్వదేశంలో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 4-1తో భారత్‌ఓడిస్తే.. ఎటువంటి సమీకరాణాలతో సంబంధం లేకుండా రోహిత్‌ సేన  (61.92 పాయింట్ల శాతం)తో ఫైనల్‌కు చేరుకుంటుంది. అదే విధంగా శ్రీలంక ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది.

ఈ పర్యటలో భాగంగా రెండు మ్యాచ్‌ మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఒకవేళ ఈ సిరీస్‌ను లంక క్లీన్‌ స్వీప్‌ చేస్తే శ్రీలంక ఖాతాలో 61.11 పీసీటీ చేరుతుంది.  అంటే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో  భారత్‌ ఓడిపోయినా, 2-2 డ్రా ముగించినా లంక ఫైనల్‌కు చేరుకుంటుంది.

మరోవైపు నాలుగో స్థానానికి పడిపోయిన సౌతాఫ్రికా ఫైనల్‌ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో 2-0 తేడాతో ప్రోటీస్‌ గెలుపొందితే.. 55.55 పీసీటీని సాధించగలుగుతుంది. కానీ భారత్ చివరి నాలుగు టెస్టుల్లో రెండు గెలిచినా దక్షిణాఫ్రికా ఫైనల్‌ ఆశలు గల్లంతు అయినట్లే.
చదవండి: సర్ఫరాజ్‌ అహ్మద్‌ సెంచరీ.. ‘చేసింది చాలు.. ఇక నాటకాలు ఆపు!’.. ట్వీట్‌ లైక్‌ చేయడంతో మరింత దుమారం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top