ఈనెల 31న భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య ఎన్నికలు

Athletics Federation of India to hold elections of its office bearers on Oct 31 - Sakshi

న్యూఢిల్లీ: ఏప్రిల్‌ నుంచి వాయిదా పడుతూ వస్తోన్న భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 31, నవంబర్‌ 1వ తేదీల్లో ఏఎఫ్‌ఐ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) నిర్వహిస్తారు. అందులో భాగంగా తొలి రోజు జరిగే సమావేశంలో ఎన్నికలు నిర్వహించి ఆఫీస్‌ బేరర్లను ఎన్నుకొనేందుకు సిద్ధమయ్యామని ఏఎఫ్‌ఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో ఎన్నికైన వారు 2024 వరకు పదవుల్లో కొనసాగనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌తో ప్రస్తుతం ఉన్న ఆఫీస్‌ బేరర్ల పదవీ కాలం ముగిసింది. అయితే కరోనా కారణంతో ఎన్నికలను నిర్వహించలేమంటూ... వారి పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఏఎఫ్‌ఐ మే నెలలో నిర్ణయం తీసుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top