IND Vs SL 2023: భారత్‌-శ్రీలంక తొలి వన్డే.. ఏకంగా సెలవిచ్చిన ప్రభుత్వం!

Assam government announces half day holiday for 1st ODI - Sakshi

స్వదేశంలో శ్రీలంకతో మరో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్‌.. ఇప్పుడు మూడు వన్డేల సిరీస్‌లో లంకతో తలపడనుంది. ఇక ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 గౌహతిలోని బర్సపరా స్టేడియం వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాంలోని కామ్‌రప్ మెట్రోపాలిటిన్ జిల్లాలో అభిమానులు మ్యాచ్ చూసేందుకు హాఫ్-డే సెలవు ప్రకటించింది. 

"బర్సపరా స్టేడియం వేదికగా శ్రీలంక-భారత్‌ తొలి వన్డే జరగనుంది. ఈ సందర్భంగా కామ్‌రప్ మెట్రోపాలిటిన్ జిల్లాలో అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు హాఫ్ డే సెలవు ప్రకటించాం. ఈ నిర్ణయం పట్ల అస్సాం గవర్నర్ కూడా సంతోషం వ్యక్తం చేశారు" అని హిమంత బిస్వా శర్మ సర్కార్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇక గతేడాది జూలై తర్వాత తొలి సారి వన్డే సిరీస్‌లో భారత- శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇక ఈ సిరీస్‌కు టీమిండియా రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ తిరిగి జట్టులోకి వచ్చారు. అదే విధంగా పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌ కూడా వన్డే సిరీస్‌లో భాగం కానున్నారు.
చదవండి: IND VS SL ODI Series: టీమిండియాకు భారీ షాక్‌.. బుమ్రా ఔట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top