
జిన్‌జూ (దక్షిణ కొరియా): ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. పురుషుల 67 కేజీల విభాగంలో జెరెమి లాల్‌రినుంగా స్నాచ్ ఈవెంట్‌లో 141 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకున్నాడు.
అయితే మిజోరం రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ల జెరెమి క్లీన్ అండ్ జెర్క్ ఈవెంట్‌లో తడబడి మొత్తం బరువును నమోదు చేయడంలో విఫలమయ్యాడు. మూడు క్లీన్ అండ్ జెర్క్ అవకాశాల్లోనూ జెరెమి నిర్ధారిత బరువును ఎత్తలేకపోయాడు. శనివారం జరిగిన మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి భారత్‌కు రజత పతకం అందించిన సంగతి తెలిసిందే.