టాస్‌ ఓడిన భారత్‌, స్టార్‌ ప్లేయర్‌కు రెస్ట్‌.. పంత్‌కు ఛాన్స్‌ | Asia Cup 2022 IND VS HK: Hardik Pandya Rested, Pant Gets Chance | Sakshi
Sakshi News home page

Asia Cup 2022 IND VS HK: టాస్‌ ఓడిన భారత్‌, స్టార్‌ ప్లేయర్‌కు రెస్ట్‌.. పంత్‌కు ఛాన్స్‌

Aug 31 2022 7:28 PM | Updated on Aug 31 2022 7:28 PM

Asia Cup 2022 IND VS HK: Hardik Pandya Rested, Pant Gets Chance - Sakshi

ఆసియా కప్‌ 2022లో భాగంగా ఇవాళ (ఆగస్ట్‌ 31) హాంగ్‌కాంగ్‌తో జరుగుతున్న గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లో.. టీమిండియా టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. అయితే ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ ఓ అనూహ్య మార్పు చేసిం‍ది. ఎవరూ ఊహించని విధంగా కీలక ప్లేయర్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాకు రెస్ట్‌ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.

తదుపరి కీలక మ్యాచ్‌లు ఉన్న దృష్ట్యా హార్ధిక్‌కు విశ్రాంతినిస్తున్నట్లు జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ సమయంలో వెల్లడించాడు. హార్ధిక్‌ స్థానంలో ఈ మ్యాచ్‌కు రిషబ్‌ పంత్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ ఒక్క మార్పు మినహాయించి పాక్‌పై గెలుపొందిన జట్టుతోనే టీమిండియా యధాతథంగా బరిలోకి దిగుతుంది. 

భారత్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్‌), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దినేష్ కార్తీక్ (వికెట్‌కీపర్‌), రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చహల్, అర్షదీప్ సింగ్ 
చదవండి: రోహిత్‌, బాబర్‌ సేనలకు భారీ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement