
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తుంది. సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌కు (25) ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనువరాలు సానియా చందోక్‌తో నిశ్చితార్థం జరిగిందని సమాచారం.
ఈ కార్యక్రమం అత్యంత సన్నిహితుల సమక్షంలో గోప్యంగా జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ సోషల్‌మీడియాలో మాత్రం జోరుగా ప్రచారం జరుగుతుంది.
Arjun Tendulkar is engaged to Saniya Chandok. 💍 pic.twitter.com/WgztsjyYx3
— Vipin Tiwari (@Vipintiwari952) August 13, 2025
అర్జున్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతున్న సానియా చందోక్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడుయేషన్ పూర్తి చేసి ప్రముఖ పెట్ కేర్ బ్రాండ్ అయిన Mr. Paws Pet Spa & Store LLPకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తుంది.
ఆమె తాత రవి ఘాయ్ హోటల్ మరియు ఫుడ్ బిజినెస్‌లో ఉన్నారు. ఘాయ్ కుటుంబం InterContinental హోటల్ మరియు Brooklyn Creamery వంటి వ్యాపారాలను నిర్వహిస్తోంది. సానియా చందోక్ ఉన్నత కుటుంబం నుంచి వచ్చినా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది. ఆమె పబ్లిక్‌లో ఎక్కువగా కనిపించదు.
అర్జున్ విషయానికొస్తే.. సచిన్ టెండూల్కర్-అంజలి దంపతులకు కలిగిన రెండో సంతానం ఈ అర్జున్. అర్జున్ 1999, సెప్టెంబర్ 24న జన్మించాడు. అతనికి ముందు సారా టెండూల్కర్ జన్మించింది. ఆమె 1997, అక్టోబర్ 12న పుట్టింది.
అర్జున్ తండ్రి అడుగుజాడల్లో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్, ఎడమ చేతి మిడిలార్డర్ బ్యాటర్ అయిన అర్జున్.. 2018లో శ్రీలంకపై అండర్-19 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.
- 2020/21లో ముంబై తరఫున T20 మ్యాచ్‌తో (సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ) సీనియర్ లెవెల్లో దేశవాలీ కెరీర్‌ను ప్రారంభించాడు.
- 2022/23లో ముంబై నుంచి గోవా జట్టుకు (దేశవాలీ) మారాడు.
- ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 17 మ్యాచ్‌లు ఆడిన అర్జున్ 532 పరుగులు చేసి, 37 వికెట్లు తీశాడు.
- అర్జున్ 2021 ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు.
- దేశవాలీ క్రికెట్‌లో అర్జున్ గోవాకు మారిన తర్వాత తొలి రంజీ మ్యాచ్‌లోనే రాజస్థాన్‌పై సెంచరీ చేశాడు.