బీసీసీఐ పొమ్మంది.. క‌ట్ చేస్తే! అభిషేక్ నాయ‌ర్‌కు మ‌రో ఆఫ‌ర్‌? | Abhishek Nayar gets another role after mid-season IPL 2025 stint with KKR | Sakshi
Sakshi News home page

బీసీసీఐ పొమ్మంది.. క‌ట్ చేస్తే! అభిషేక్ నాయ‌ర్‌కు మ‌రో ఆఫ‌ర్‌?

Apr 26 2025 6:10 PM | Updated on Apr 26 2025 6:29 PM

Abhishek Nayar gets another role after mid-season IPL 2025 stint with KKR

టీమిండియా అసిస్టెంట్‌ కోచ్ అభిషేక్ నాయ‌ర్‌పై బీసీసీఐ వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. భార‌త క్రికెట్ జ‌ట్టుతో తెగ‌దింపులు చేసుకున్న నాయ‌ర్‌.. తిరిగి మ‌ళ్లీ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌ జ‌ట్టుతో జత‌క‌ట్టాడు. కేకేఆర్ కోచింగ్ స్టాప్‌లో అభిషేక్ భాగ‌మ‌య్యాడు. గ‌తేడాది సీజ‌న్‌లో కోల్‌క‌తాను ఛాంపియ‌న్‌గా నిల‌ప‌డంలో నాయ‌ర్‌ది కీల‌క పాత్ర‌. మ‌రోసారి త‌మ జ‌ట్టును విజ‌య‌ప‌థంలో న‌డిపిస్తాడ‌ని నాయ‌ర్‌పై కేకేఆర్ మెనెజ్‌మెంట్ గంపెడు ఆశ‌లు పెట్టుకుంది.

అయితే ఐపీఎల్ మ‌ధ్య‌లోనే నాయ‌ర్‌కు మ‌రో ఆఫర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ముంబై టీ20 లీగ్‌లో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ జ‌ట్టు మెంటార్‌గా నాయ‌ర్ ఎంపిక‌నైట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా త‌మ క‌థ‌నంలో పేర్కొంది. అభిషేక్ నాయ‌ర్‌ను ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ త‌మ మెంటార్‌గా నియ‌మించింది.

త్వ‌రలోనే అభిషేక్ నాయ‌ర్ ఎంపిక‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వెల‌వ‌డ‌నుంది అని క్రికెట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ టోర్న‌మెంట్ మే 26 నుంచి ప్రారంభం కానుంది. అదేవిధంగా ఈ టోర్నీలో భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అంధేరీ జ‌ట్టుకు ప్రధాన కోచ్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. వీరితో పాటు  ఓంకార్ సాల్వి సోబో ముంబై ఫాల్కన్స్‌కు, ఐపీఎల్ మాజీ స్టార్ ప్రవీణ్ తంబే నార్త్ ముంబై పాంథర్స్‌కు హెడ్ కోచ్‌గా ఎంపిక‌య్యారు.
చ‌ద‌వండి: IPL 2025: 'శ్రేయ‌స్ చాలా బాధ‌ప‌డ్డాడు.. కేకేఆర్‌కు చుక్క‌లు చూపిస్తాడు'
 

Advertisement
 
Advertisement
Advertisement