CWG 2022: కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు వెళ్లిన బృందంలో 10 మంది లంక ఆటగాళ్లు అదృశ్యం

10 Members Of Sri Lanka Athletes Disappear From CWG 2022 - Sakshi

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2022 బర్మింగ్‌హమ్‌ వేదికగా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. గతనెల 28న ప్రారంభమైన కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఆగస్టు 8న ముగిశాయి. ఈ గేమ్స్‌కు 72 దేశాలు పాల్గొనగా.. అందులో శ్రీలంక కూడా ఉంది. ఈసారి కామన్వెల్త్ లో వివిధ క్రీడాంశాల్లో పాల్గొనేందుకు గాను లంక.. 110 మంది (50 మంది పురుషులు, 60 మంది మహిళలు)తో కూడిన అథ్లెట్ల బృంధం బర్మింగ్‌హామ్‌కు వెళ్లింది.

అయితే గేమ్స్‌ జరుగుతున్న సమయంలోనే 10 మంది లంక అథ్లెట్లు కనిపించకుండా పోయారు. అథ్లెట్లతో పాటు పలువురు అధికారులు కూడా తప్పిపోయినట్లు సమాచారం. కాగా ఆటల కోసమని వచ్చిన ఆటగాళ్లలో మిస్ అయినవాళ్లు తమ బ్యాగులను  క్రీడాగ్రామంలోనే వదిలి అక్కడ్నుంచి వెళ్లిపోవడం విశేషం. వీళ్లకు ఆరునెలల పాటు  వీసాలున్నాయని తెలుస్తున్నది. అయితే అదృశ్యమైన తొలి ముగ్గురు అథ్లెట్లను బర్మింగ్‌హామ్ పోలీసులు వెతికి పట్టుకున్నారని, కానీ వాళ్లను ఎక్కడ ఉంచింది మాత్రం వెల్లడించలేదని లంక ప్రతినిధులు తెలిపారు. 

లంకలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఆ దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఒక్కపూట తిండి దొరక్క అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో బర్మింగ్‌హామ్ కు వెళ్లిన లంక అథ్లెట్లు కూడా ఇదే కారణంతో  అక్కడ ఆగిపోయి ఉంటారని.. స్వదేశానికి వెళ్లి తిండి తిప్పలు మాని అల్లాడటం కంటే యూకేలోని ఆగిపోయి ఏదో ఒక పని చేసుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి అదృష్యమైన ఆ పది మంది ఆటగాళ్ల జాబితా ఎక్కడుంది అనేది ఆసక్తికరంగా మారింది. కాగా కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో  శ్రీలంక.. ఒక రజతం, మూడు కాంస్యాలతో మొత్తంగా 4 పతకాలు సాధించి పతకాల పట్టికలో 31వ స్థానంలో నిలిచింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top