దిగేదే ల్యా.. పుష్ప–3

Pushpa listens to the article Why the Global Race for the Lunar South pole - Sakshi

వైరల్‌

చంద్రయాన్‌–3 విజయవంతమైన ఆనందంలో ఉండగానే ‘పుష్ప’ చిత్రం జాతీయస్థాయిలో అవార్డ్‌లు సొంతం చేసుకుంది. ఒకవైపు ‘పుష్ప–2’ షూటింగ్‌లో ఉండగానే మరోవైపు నెటిజనులు చంద్రయాన్, పుష్ప ఆనందాన్ని మిక్స్‌ చేస్తూ ఎవరికి వారు ‘పుష్ప–3’ స్టోరీలైన్‌ రెడీ చేశారు. అందులో ఒకటి... ఆంగ్లపత్రికలో వచ్చిన ‘వై ది గ్లోబల్‌ రేస్‌ ఫర్‌ ది లునార్‌ సౌత్‌ పోల్‌’ అనే వ్యాసాన్ని అనువాదం చేయించి తెలుగులో వింటాడు పుష్ప.

చంద్రుడి దక్షిణ ధృవంపై ఉన్న విలువైన ఖనిజాల గురించి విన్న తరువాత గంధపు చెట్లపై పుష్పకు ఆసక్తిపోయింది. ‘కొడితే సౌత్‌ పోల్‌ కొట్టాలి. విలువైన ఖనిజాలు కొట్టేయాలి’ అని గట్టిగా డిసైడై పోయాడు. చిత్తూరు జిల్లాకు చెందిన పుష్పరాజ్‌ చంద్రుడి దక్షిణ ధృవం పైకి చేరుతాడా? అక్కడి ఖనిజాలను సొంతం చేసుకుంటాడా? ఒకవేళ చేసుకుంటే విలన్‌ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ ఎలా అడ్డుపడుతాడు... అనేది నెటిజనుల ఊహల్లో పుట్టిన పుష్ప–3 స్థూల కథ.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top