చిన్నకోడూరు(సిద్దిపేట): జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా హద్దులు పెట్టి ఫెన్షింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని ఇబ్రహీంనగర్ డంపింగ్ యార్డు వద్ద భూమిని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల రికార్డులు పరిశీలించి, ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఎంత? ఆక్రమణకు గురైన పూర్తి సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ప్రభుత్వ భూమి చుట్టూ హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. అక్రమంగా కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఆక్రమణకు గురికావొద్దు
కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని కలెక్టర్ హైమవతి తహసీల్దార్ దివ్యను ఆదేశించారు. సోమవారం కొమురవెల్లి పాత కమాన్, కేజీబీవీ పాఠశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. అనంతరం ఆమె మట్లాడుతూ ప్రభుత్వ భూమిని అనుమతి లేకుండా ఆక్రమించడం చట్టవిరుద్ధమన్నారు.
హౌసింగ్ పీడీగా భగవంతరావు
సిద్దిపేటజోన్: జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌గా భగవంతరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పీడీ శ్రీనివాస్ పదవీ విరమణ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా పీడీగా పనిచేస్తున్న భగవంతరావును ప్రభుత్వం జిల్లాకు బదిలీ చేసింది. ఈ సందర్భంగా ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్ హైమావతిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని, త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
కలెక్టర్ హైమావతి
పలు ప్రాంతాల్లో పరిశీలన


