నాణ్యమైన విద్య అందించండి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్య అందించండి

Jul 8 2026 9:32 AM | Updated on Jul 8 2026 9:32 AM

సిద్దిపేటఎడ్యుకేషన్‌: కళాశాలలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకు లంతా కృషి చేయాలని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్‌రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (కో ఎడ్యుకేషన్‌)ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫస్టియర్‌లో 500లకు పైగా విద్యార్థులను చేర్చుకుని జిల్లాలో నంబర్‌వన్‌గా నిలిచారని ప్రశంసించారు. కళాశాలలో చేరిన విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలన్నారు. కోర్సులన్నీ మంచివేనని అన్నింటిలో విద్యార్థులు చేరేలా పోత్సహించాలని సూచించారు. అధ్యాపకులు సమయ పాలన పాటిస్తూ ఆదర్శంగా నిలవాలన్నారు. కళాశాలల్లో చేరిన విద్యార్థుల్లో అధికశాతం పేదలేనని వారందరికీ స్కాలర్‌షిప్‌లు వచ్చేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. కళాశాలకు నాలుగు తరగతి గదులు మంజూరు చేయించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రిన్సిపాల్‌ ప్రమీల మాట్లాడుతూ కళాశాలలో సుధీర్ఘ అనుభవం ఉన్న అధ్యాపకులున్నారని వారిని సేవలను ఉపయోగించుకుని ఉత్తమ ఫలితాలను సాధిస్తామన్నారు. అనంతరం కళాశాలలో ఏర్పా టు చేసిన ఆధార్‌ అప్‌డేట్‌ కేంద్రాన్ని పరిశీలించారు. డ్రై డేలో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లతో కలిసి పరిసరాల పరిశుభ్రం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏజీఎంసీ దేవయ్య, స్టాఫ్‌ సెక్రటరీ సుధాకర్‌రెడ్డి, స్టూడెంట్‌ కౌన్సిలర్‌ కనకచంద్రం, డిసిప్లీన్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, స్పోర్ట్స్‌ ఇన్‌చార్జి అశోక్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రొగ్రాం అధికారి ధరిపల్లి నగేష్‌తో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.

కళాశాలల్లో ఉత్తమ ఫలితాలుసాధించాలి

డీఐఈఓ రవీందర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement