దుబ్బాక చేనేత పాలకవర్గం ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

దుబ్బాక చేనేత పాలకవర్గం ఏకగ్రీవం

Jul 8 2026 9:32 AM | Updated on Jul 8 2026 9:32 AM

దుబ్బాక: చేనేత సహకార సంఘం పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. మంగళవారం ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాలకవర్గం ఎన్నికలో.. చైర్మన్‌గా అంకం మధు ఒక్కరే నామినేషన్‌ వేశారు. దీంతో ఆయనను చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. అలాగే వైస్‌ చైర్మన్‌గా గాజుల భాస్కర్‌, జనరల్‌ సెక్రటరీగా బోడ చంద్రమోహన్‌, కోశాధికారిగా కారంపురి గురుచరణ్‌ సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికై న చైర్మన్‌, పాలకవర్గంతో పాటు డైరెక్టర్లు సిరిగాధ నర్సింలు, మెత్కు కవిత, చెలిమెల రాజేశం, రాపెల్లి నాగరాజు, గడ్డం రాజమణి లతో ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ పాలకవర్గం ఐదేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు.

పలువురు అభినందనలు..

పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రీరాం సంగీత, కౌన్సిలర్లు శ్రీరాం సరస్వతి, నందాల శ్రీకాంత్‌, బడుగు రాజుతో పాటు రామక్కపేట సర్పంచ్‌ విఠోభ, పద్మశాలి సమాజం అధ్యక్షులు జిందం గాలయ్య, నీలకంఠ సంఘం అధ్యక్షులు బోడ శ్రీహరి,నాయకులు, పలువురు సన్మానించి అభినందించారు.

సిద్దిపేట చేనేత సహకార సంఘం సైతం..

సిద్దిపేటజోన్‌: సిద్దిపేట చేనేత సహకార సంఘం పాలకవర్గం సైతం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. అధ్యక్షుడిగా జనార్దన్‌, ప్రధాన కార్యదర్శిగా రాధా కిషన్‌, ఉపాధ్యక్షుడిగా సుధాకర్‌, కోశాధికారిగా ప్రభాకర్‌తో పాటు డైరెక్టర్లుగా దత్తాత్రేయ, నగేష్‌, శ్రీనివాస్‌, భాగ్య, సరళ నియమితులయ్యారు. అమృతసేనా రెడ్డి ఎన్నికల అధికారి, మేనేజర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జిల్లా కేంద్రంలోని సిద్దిపేట ప్రాజెక్టు ఎన్నికల్లో 11మంది అభ్యర్థులకు ఏడుగురు ఉపసంహరణ కావడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని చేనేత జౌళి శాఖ ఏడీఓ రమ్య ధ్రువీకరించారు.

సహకార సంఘం చైర్మన్‌గా అంకం మధు

ప్రమాణస్వీకారం చేయించినఎన్నికల అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement