రూ.870 కోట్లు.. | - | Sakshi
Sakshi News home page

రూ.870 కోట్లు..

Jul 8 2026 9:32 AM | Updated on Jul 8 2026 9:32 AM

ఉమ్మడి జిల్లాలో రైతు భరోసా నిధులు జమ

9.33 లక్షలమంది రైతులు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రైతు భరోసా పథకం కింద 9,33,950 మంది రైతులకు రూ.8,70,25,44,519లు వారి ఖాతాల్లో జమయ్యాయి. గతనెల జూన్‌ 30న రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఎకరాకు 6వేల చొప్పున ఈ నిధులను విడుదల చేసింది. నిత్యం విడతల వారీగా ఈనెల 7వ తేదీ వరకు 7 ఎకరాల వరకు భరోసా నిధులను జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారులు తెలిపారు.

నారాయణఖేడ్‌: సంగారెడ్డి జిల్లాలో 3,50,560 మంది రైతులకు రూ.348 కోట్లు, సిద్దిపేట జిల్లాలోని 3,19,601మంది రైతులకు రూ.317 కోట్లు, మెదక్‌ జిల్లాలో 2,63,789 మంది రైతులకు గాను రూ.204 కోట్ల కు పైగా విడుదలయ్యాయి. ఈ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోనే ప్రభుత్వం జమ చేసింది.

రైతులకు ప్రయోజనం

రైతు భరోసా పథకం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోళ్లకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. సీజన్‌ ప్రారంభంలోనే నిధుల విడుదల వల్ల రైతులు వడ్డీకి అప్పులు చేసే బాధ తప్పినట్లైంది. ఇప్పటికే చాలామంది రైతులు విత్తనాలు విత్తుకొన్నారు. ఈ నెల 15వ తేదీవరకు ఆయా పంటలు విత్తుకునేందుకు కూడా అవకాశం ఉంది. ప్రస్తుతం విడుదలైన నిధులు ఎరువులు, పురుగు మందులు, కలుపుతీత, ఇతరత్రా ప్రయోజనాలకు రైతులకు ఉపయుక్తంగా మారనుంది. సీజన్‌ ప్రారంభం కాగానే ప్రభుత్వం విడుదల చేయడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతుంది.

ఏడెకరాల వరకు ఇచ్చిన ప్రభుత్వం

విడతల వారీగా విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement