ఎన్నో ఆశలతో పత్తి సాగు చేయడానికి 4 ఎకరాలు దున్ని సిద్ధం చేశా. రోజూ మబ్బులు వచ్చి మురిపిస్తున్నాయి. కానీ చినుకు పడ్తలేదు. మరో 4ఎకరాలలో వరి సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. రెండు కార్తెలు దాటినా వర్షాలు పడతలేవు. వర్షాలు పడక పోతే అప్పుల పాలయితం.
– బాల్‌రెడ్డి (రైతు) ఎర్రవల్లి
పెద్ద వర్షాలు కురిసాకే సాగు..
రైతులు ఏం ఆందోళన చెందవద్దు. పెద్ద వర్షాలు కురిసాకే పంటలు సాగు చేసుకోవాలి. పత్తి, మొక్కజొన్న పంటలు జులై 15 వరకు వేసుకోవచ్చు. జూలైలో మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. వరినార్లు సైతం బోర్ల నీటి పరిస్థితిని మేరకు వేసుకోవాలి.
– స్వరూపరాణి, జిల్లా వ్యవసాయాధికారి


