తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్, గజ్వేల్ స్పోర్ట్స్ హబ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఒలింపిక్ డే రన్ ఉత్సాహంగా సాగింది. కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డిలు ముఖ్యఅతిథిలుగా హాజరై ఒలింపిక్ జ్యోతిని వెలిగించి రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్‌లో స్పోర్ట్స్ హబ్ నిర్మాణానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 27ఎకరాల భూమిని కేటాయించిందని గుర్తు చేశారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని గుర్తు చేశారు. గజ్వేల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అంతా సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ చందన, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, గజ్వేల్ మాజీ జెడ్పీటీసీ పంగ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. –గజ్వేల్


