సాగులో విత్తనాల ఎంపిక కీలకం | - | Sakshi
Sakshi News home page

సాగులో విత్తనాల ఎంపిక కీలకం

Jun 24 2026 9:10 AM | Updated on Jun 24 2026 9:10 AM

సాగులో విత్తనాల ఎంపిక కీలకం

చిన్నకోడూరు(సిద్దిపేట): పంట సాగులో విత్తనాల నాణ్యత, ఎంపిక కీలకమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి అన్నారు. మంగళవారం చిన్నకోడూరు రైతు వేదికలో విత్తన మేళ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన ఏడు సన్నరకాల వరి విత్తనాలతో పాటు ఇతర పంటల నాణ్యమైన విత్తనాలు రైతు వేదికలో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి న కేంద్రాల్లోనే రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు ఒకే చోట కొనుగోలు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. మెరుగైన వ్యవసాయ పద్దతులపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ మీసం మహేందర్‌, ఎఫ్‌పీ ఓ చైర్మన్‌ వెంకట్‌ రెడ్డి, సర్పంచ్‌ తిరుపతిరెడ్డి, ఏఓ జయంత్‌ కుమార్‌, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement