ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

Jun 23 2026 7:49 AM | Updated on Jun 23 2026 7:49 AM

ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం దరఖాస్తుల ఆహ్వానం టెట్‌ ప్రశాంతం ‘వర్గీకరణ’ సద్వినియోగం చేసుకోండి

నంగునూరు(సిద్దిపేట): ఇంజనీరింగ్‌ కళాశాలలో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న టీజీ ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ సోమవారం ప్రారంభమైంది. రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు మొదటి రోజు 480 మంది విద్యార్థులు హాజరయ్యారు. ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం విద్యార్థులకు లాగిన్‌ఐడీ, పాస్‌వర్డు అందజేశారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్‌ గోవర్ధన్‌ మాట్లాడుతూ కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యారులు 25 నుంచి కళాశాల లకు వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో కౌన్సెలింగ్‌ ఇన్‌చార్జి అభినవ్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ జస్టిస్‌లో మూడేళ్లు శిక్షణ పొందేందుకు లా పట్టభద్రులైనా ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారి హమీద్‌ సోమవారం తెలిపారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు నెలకు రూ.50వేలు స్టైఫండ్‌ అందించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

సిద్దిపేటఅర్బన్‌: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్‌) ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజైన సోమవారం జరిగిన పరీక్షకు ఉదయం సెషన్‌కు 50 మందిని కేటాయించగా 41 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌కు 50 మందికి గాను 38 మంది హాజరయ్యారు. రెండు సెషన్‌లకు కలిపి 21 మంది గైర్హాజరయ్యారు.

ఎమ్మార్పీఎస్‌ జాతీయ నేత మందకుమార్‌

చేర్యాల(సిద్దిపేట): మాదిగలు ఎస్సీ వర్గీకరణ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ నేత, జిల్లా ఇన్‌చార్జి మంద కుమార్‌ అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని ఓ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్‌ జిల్లా కో–ఇన్‌చార్జి మల్లిగారి యాదగిరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ పిలుపు మేరకు గ్రామ స్థాయిలో ఎమ్మార్పీఎస్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా లభించే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు విద్య, ఉద్యోగఅవకాశాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అలాగే వచ్చే నెల 7న జరిగే ఎమ్మార్పీఎస్‌ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో ఘనంగా జరుపుకోవాలని, అంతటా జెండాలు ఎగురవేయాలని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరి, సురేష్‌, కనకరాజు, నవీన్‌, రాజేష్‌, విక్రమ్‌, శ్రీనివాస్‌, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement