చేర్యాల(సిద్దిపేట): భారీగా పెంచిన ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలని రాష్ట్ర రైతు సంఘం(ఏఐకేఎస్) జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ దిలీప్‌నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు శాపంగా మారిన యూరియా యాప్‌ను రద్దు చేయాలని, పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలను, నకిలీ పురుగు మందులు అమ్మే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి శిక్షించాలన్నారు. పంటల బీమా పథకాన్ని రూపొందించే అమలు చేయాలని కోరారు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి ఏ విత్తనాలు వేసుకోవాలో రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కనకయ్య, దేవదానం, ఎల్లవ్వ, లచ్చవ్వ, పోశయ్య, కిష్టయ్య, రాములు, మల్లేశం, నర్సిరెడ్డి, శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.


