విద్యార్థులు అరకొరే.. | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు అరకొరే..

Jun 22 2026 7:03 AM | Updated on Jun 22 2026 7:03 AM

దుబ్బాక శాసన సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామం పోతారంలో ప్రాథమిక పాఠశాల ఉంది. 28 మంది విద్యార్థులుండగా అందులో బాలురు 14, బాలికలు 14 మంది ఉన్నారు. మూడో తరగతిలో ఒక్కరూ లేకపోవడం గమనార్హం. ఈ గ్రామం నుంచి ఎక్కువగా దుబ్బాకలోని ప్రైవేట్‌ పాఠశాలలకు విద్యార్థులు వెళ్తున్నారు. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులే ఉన్నారు. పాఠశాలలో సౌకర్యాలు ఉన్నప్పటికీ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య పెంచాలి. అలాగే గ్రామస్తులతో సమావేశం నిర్వహించి పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను వివరించాలి. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement