● వెంటనే ఫిట్‌మెంట్ అమలు చేయాలి ● టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు జాప్యం చేయకుండా పీఆర్సీ నివేదిక ఇచ్చి, ఫిట్‌మెంట్ అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశం ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు జీపీఎస్ ఖాతాలు తెరిపించి, పాత పెన్షన్‌లోకి తీసుకోవాలన్నారు. ఉద్యోగులందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు. ఉపాధ్యాయులకు హెల్త్ కేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఉద్యోగులందరికీ వెంటనే డిజిటల్ హెల్త్ కార్డులు ఇచ్చి ఉచిత వైద్యం అందించాలన్నారు. కేజీబీవీ, గురుకులాలు, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వలి అహ్మద్, ప్రధాన కార్యదర్శి యాదగిరి, చిర్ర యాదగిరి, వెంకటకిరణ్, కృష్ణ, రాజు, తదితరులు పాల్గొన్నారు.


