సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్వగ్రామం బెజ్జంకి మండలం తోటపల్లి. గ్రామంలోని ప్రాథమిక పాఠ శాలలో 25 మంది, ఉన్నత పాఠశాలలో 36 విద్యార్థులు చదువుతున్నారు. వర్షం పడితే గ్రామంలోని వరద అంతా ఉన్నత పాఠశాల ఆవరణలోకి వచ్చి చేరుతోంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలకు ప్రహరీ నిర్మించి బయట నుంచి కాలువ నిర్మాణం చేసి తరలించాలి. అలాగే తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. వాటి స్థానంలో నూతన గదులు నిర్మించాలి. కిచెన్ షెడ్ నిర్మాణం నాలుగేళ్ల క్రితం అర్థంతరంగా నిలిచిపోంది. దీంతో వర్షం పడితే వంట కార్మికులు వంట వండేందుకు ఇబ్బంది పడుతున్నారు. బీఎన్‌ఆర్ ప్రాథమిక పాఠశాలలో తాగునీటి సమస్యతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు.


