గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Jun 21 2026 8:10 AM | Updated on Jun 21 2026 8:10 AM

బెజ్జంకి(సిద్దిపేట): ప్రజాసంక్షేమంతో పాటు గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మండలంలోని దేవక్కపల్లె, పెరుకబండ గ్రామాలలో రూ.54 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే పోతారంలో డ్రైనేజీ పనులు ప్రారంభించారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు ఇచ్చేది కాంగ్రెస్‌ మాత్రమేన్నారు. అనంతరం గాగిళ్లాపూర్‌, బెజ్జంకిలలో మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. కార్యక్రమాలలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్‌, ఏఎంసీ చైర్మన్‌ పులి కృష్ణ, పార్టీ మండల అధక్షుడు శ్రీనివాస్‌, సర్పంచ్‌లు, నాయకులు నర్సయ్య, సంపత్‌రెడ్డి, వెంకటలక్ష్మి, స్వప్న, రాజు, సంతోష్‌, రాజు, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement