మొత్తం పంటను కొనాలి | - | Sakshi
Sakshi News home page

మొత్తం పంటను కొనాలి

Jun 21 2026 8:10 AM | Updated on Jun 21 2026 8:10 AM

మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి

పాపన్నపేట(మెదక్‌): రైతులు పండించిన పూర్తి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డికి శనివారం బహిరంగ లేఖ రాశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం 25 శాతం కొనుగోలు చేసినా, మిగితా ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కొనుగోలు చేయాలన్నారు. కేవలం 7 రకాలకే బోనస్‌ ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. అన్ని సన్న రకాలకు బోనస్‌ ఇవ్వాలన్నారు. సకాలంలో వరి పంటను కొనక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు.

నేడు ‘పేట’లో

కేన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌

రామాయంపేట(మెదక్‌): పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం కేన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ప్రక్రియను మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్‌ శంకర్‌గౌడ్‌ విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement